Naga Shaurya : అనుష్కతో డేటింగ్లో ఉన్నా అని రాయండి.. నాగశౌర్య.. కోరికలు మామూలుగా లేవుగా..

- Advertisement -

Naga Shaurya సినీ ఇండస్ట్రీ అన్నాక కొద్దిగా క్లోజ్ గా ఉన్న రూమర్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి.. మరి సెలెబ్రిటీలలో ఈ రూమర్స్ ను కొంత మంది లైట్ గా తీసుకుంటే మరికొంత మంది మాత్రం సీరియస్ గా తీసుకుని వాటిపై స్పందిస్తారు.. అయితే యంగ్ హీరో నాగ సౌర్య మాత్రం అందరి కంటే కాస్త భిన్నంగా స్పందించాడు అనే చెప్పాలి.టాలెంటెడ్ హీరోల్లో నాగ సౌర్య ఒకరు. కృష్ణ వ్రింద విహారి మూవీతో హిట్ కొట్టిన నాగ‌శౌర్య.. ఆ త‌ర్వాత ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో డిజాస్టర్ అందుకున్నాడు. రీసెంట్ గా రంగబలి మూవీతో వ‌చ్చాడు. ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ‌లి అయిపోయారు అన‌డంలో సందేహం లేదు. పవన్ బసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌, యుక్తి తరేజా జంట‌గా న‌టించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుద‌లై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

Naga Shaurya
Naga Shaurya

ఈ హీరో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ముఖ్యంగా ఛలో సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. ఇక ఇటీవలే ఈయన రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా నాగశౌర్య తనపై వచ్చిన డేటింగ్ వార్తల గురించి స్పందించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయనపై వచ్చిన రూమర్స్ పై మాట్లాడుతూ.

నాకు పెళ్లికాక ముందు ఇలాంటివి చాలా వచ్చాయని… నిహారిక, రాశిఖన్నా, మాళవిక ఇలా నేను నటించిన హీరోయిన్స్ అందరితో డేటింగ్ చేస్తున్నట్టు రాసేవారు. అయితే నిజం ఏంటంటే నేను ఏ హీరోయిన్ తో కూడా డేటింగ్ చేయలేదు.. నాకు అనుష్క అంటే చాలా ఇష్టం.. కానీ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టు ఒక్కసారి కూడా రాయలేదు.. ప్లీజ్ అలా రాయండి అని నేను గతంలో సరదాగా చెప్పేవాడిని అంటూ ఈ ప్రమోషన్స్ లో గుర్తు చేసుకున్నారు.. ఈయన చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here