BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం సరిగ్గా పది రోజుల్లో, అనగా జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటన లో బిజీ గా ఉండడం వల్ల, ఈ చిత్రం లో ఆయనతో పాటు నటించిన సాయి ధరమ్ తేజ్ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గానే ఆయన మూడు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ‘బ్రో’ చిత్రం గురించి ఎన్నో విశేషాలు చెప్పుకొచ్చాడు.
సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించడనీ , ఆ తర్వాత సినిమా చివరి వరకు ఉంటాడని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమా తరహాలో ఉంటుందని, ప్రారంభం మొత్తం ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయి ఉండగా, చివరి అరగంట మాత్రం గుండెల్ని పిండేసే రేంజ్ ఎమోషన్ ఉంటుందని సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఈ సినిమాని నిన్ననే సెన్సార్ కి పంపించారు. సెన్సార్ కి పంపే ముందు ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ చేసిన ఒక పనికి నిర్మాతల గుండెలు ఆగినంత పని అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే థమన్ ఈ సినిమాలో జత చెయ్యాల్సిన సాంగ్ ని సెన్సార్ జరిగే చివరి నిమిషం వరకు పంపలేదట. దీంతో నిర్మాతలకు గుండెలు ఆగినంత పని అయ్యింది.
ఎందుకంటే సెన్సార్ కార్యక్రమాలకు అన్నీ పక్కాగా ఉండాలి, డబ్బింగ్ అయినా అవ్వకపోయినా సినిమాలో ఉండాల్సిన సాంగ్స్ , సన్నివేశాలు అన్నీ ఉండాలి, అప్పుడే సెన్సార్ బోర్డు వారి సర్టిఫికేట్ ఇస్తారు. అలాంటిది చెయ్యాల్సిన పనిని చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టి చేసాడంటే, థమన్ కి అసలు ఈ సినిమా మీద ఆసక్తి లేదా?, ఎందుకు ఇంత నిర్లక్ష్యం?, రీసెంట్ గా విడుదలైన రెండు పాటలు కూడా అభిమానులను అలరించలేకపోయాయి, రేపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా తేడా జరిగితే నిన్ను వదిలిపెట్టము అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థమన్ కి ట్విట్టర్ లో వార్నింగ్ లు ఇస్తున్నారు.