Tanikella Bharani : విలక్షణ నాటినుడిగా పేరు తెచ్చుకున్న అతి కొద్దిమంది మహా నటులలో ఒకడు తనికెళ్ళ భరణి. కామెడీ అయినా విలనిజం అయినా ,సెంటిమెంట్ అయినా ఇలా ఏ యాంగిల్ అయినా తన డైన సిలి లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మైమర్చిపోయేలా చేసే నటుడు ఆయన. సినిమాల్లోకి రాకముందే ఎన్నో సినిమాలకు రచయిత గా వ్యవహరించిన ర్తానికేళ్ల భరణి, ఆ తర్వాత నటుడిగా కూడా వచ్చిన ప్రతీ అవకాశం ని సద్వినియోగ పర్చుకుంటూ ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతూనే ఉన్నాడు.
అంతే కాదు , ఈయన దర్శకుడిగా కూడా ‘మిథునం’ లాంటి క్లాసిక్ చిత్రాన్ని తీసాడు. మహా శివుని భక్తుడిగా ఎప్పుడూ ఆయన నామస్మరణ లో ఉండే తనికెళ్ళ భరణి , ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన యుక్త వయస్సులో చేసిన కొన్ని సంఘటనల గురించి , ఎదురైనా అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు.
యాంకర్ తనికెళ్ళ భరణి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు టీనేజ్ లో చాలా అందంగా ఉంది ఉంటారు కదా, మంచి పొడవు, కటౌట్ కూడా ఉంది. మీ వెంట అమ్మాయిలు పడలేదా’ అని అడగగా, తనికెళ్ళ భరణి దానికి సమాధానం చెప్తూ ‘ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు 6 మంది యంగ్ హీరోయిన్స్ నన్ను ప్రేమించారు. నాతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటి నుండి లంచ్ బాక్స్ తీసుకొని రావడమో, ఎదో ఒకటి కొన్నివడమో వంటివి చేసేవారు. వాళ్ళ నుండి లవ్ లెటర్స్ కూడా వచ్చాయి. ఇప్పటికీ నా దగ్గర అవి భద్రంగా ఉన్నాయి, నా భార్య వాటిని చదువుతూ ఇంత అందమైన అమ్మాయిలు మీ వెంట పడ్డారు కదా , మీరెందుకు నన్నే పెళ్లి చేసుకున్నారు అని అడిగేది’ అంటూ తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆయన్ని అనితల ప్రేమించిన ఆ హీరోయిన్స్ ఎవరు , ఏమిటి అనేది వివరాలు తెలియవు.