Mahaveerudu : తమిళ క్రేజీ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మావీరన్’ తెలుగులో ‘మహావీరుడు’ పేరిట రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ సినిమాకి కాస్త పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చినా కూడా,వసూళ్లు మాత్రం అంతంత మాత్రం గానే వస్తున్నాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం కమర్షియల్ గా తెలుగు లో డిజాస్టర్ వైపు అడుగులు వేస్తుందని అంటున్నారు.
ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు కోట్ల 50 లక్షలు రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ మొదటి మూడు రోజులు వచ్చిన వసూళ్లు బయ్యర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి. ఈ సినిమా వసూళ్ల పై ఈ రేంజ్ ప్రభావం పడడానికి కారణం ‘బేబీ’ మూవీ కి వస్తున్న వసూళ్లు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
యూత్ ఆడియన్స్ కి ఆ సినిమానే మొదటి ఛాయస్ అవ్వడం వల్ల , ఆ చిత్రానికి టికెట్ దొరకని వాళ్ళు ఈ సినిమాకి బుక్ చేసుకుంటున్నారు కానీ, ఈ సినెమాకంటూ థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ లేరని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 77 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలాగే రెండవ రోజు 90 లక్షల రూపాయిల గ్రాస్, మూడవ రోజు కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అలా మూడు రోజులకు కలిపి రెండు కోట్ల 67 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాకి, కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలి అంటే మరో మూడు కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు ట్రేడ్ పండితులు, అదే కానీ నిజమైతే శివ కార్తికేయన్ కి వరుసగా బ్యాక్ 2 బ్యాక్ డిజాస్టర్స్ పడినట్టు లెక్క.