Samantha : ఆధ్యాత్మిక బాటలో సమంత…అందుకోసమేనా?

- Advertisement -

Samantha స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ముందుగా సైన్ చేసిన ఖుషి, సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఖాళీగా ఉన్న సమంత తన సమయాన్ని పుణ్యక్షేత్రాల దర్శనానికి కేటాయిస్తున్నారు..గత ఏడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఖుషి షూటింగ్ సమంత అనార్యోగం బారిన పడటంతో ఆగిపోయింది. మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు. కొంతమేర కోలుకున్న సమంత తిరిగి నటించడం స్టార్ట్ చేశారు.. ఆ సినిమాను ఇటీవల పూర్తి చేశారు..

Samantha
Samantha

ఇప్పుడు ఖాళీగా నేపథ్యంలో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ భక్తురాలిగా మారిపోయింది.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఇక జులై 13న సిటాడెల్ షూట్ కూడా కంప్లీట్ చేసింది. ఆరు నెలలు కష్టంగా గడిచాయని సమంత తెలియజేశారు. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరవధికంగా పాల్గొన్న సమంత కష్టం మీద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు.. దాంతో మరో ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.. అందుకే ఒక్క సినిమాకు కూడా సమంత సైన్ చెయ్యలేదు..

సమంత ట్రీట్మెంట్ కు కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందట. సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్న మాట నిజమేనా అనే సందేహాలు ఉన్నాయి. ఆమె మిత్రుడు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.. కొద్దిరోజుల్లో అమెరికా ప్రయాణం ఉండగా సమంత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో గల వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. కీలకమైన చికిత్సకు ముందు సమంత మనో ధైర్యం కోసం ఇష్ట దైవాల దర్శనం చేసుకుంటారని తెలుస్తుంది.. సమంత లుక్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here