Murari : కొన్ని సినిమాలు ఎన్నేళ్లు అయినా పాతబడవు, ఎన్నిసార్లు చూసిన అసలు బోర్ కొట్టదు. చిత్రం లోని నటీనటులు, కథ , కథనం , సంగీతం ఇలా అన్నీ విభాగాలు డ్యూటీ చేస్తేనే అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు వస్తుంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. కెరీర్ ప్రారంభం లో ఆయన హీరో గా నటించిన ‘మురారి’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
నటుడిగా మహేష్ బాబు ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ఇది. ఇప్పటికీ టీవీ లో వేసినా కూడా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి ఈ చిత్రానికి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటుగా ఇతర నటీనటులు కూడా అద్భుతంగా చేసారు. వారిలో ముందుగా శబరి పాత్ర పోషించిన సుకుమారి గురించి మనం మాట్లాడుకోవాలి.
ఈ సినిమాలో ఆమెది అత్యంత కీలకమైన పాత్ర, కథ ఆమెతోనే సుఖాంతం అవుతుంది. కథలో అంత కీలక పాత్ర పోషించిన సుకుమారి గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అదేమిటంటే ఈమె మలయాళం లో అత్థి పెద్ద స్టార్ హీరోయిన్, నేషనల్ అవార్డు ని పొందిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. నమ్మ గ్రామం అనే సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఈమెకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు వచ్చింది.
ఆ తర్వాత ఈమెకి తమిళనాడు లో ఎన్ని ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఉన్నాయో, అవన్నీ దక్కాయి. అవన్నీ లెక్కపెడితే వందకి పైగానే అవార్డ్స్ వచ్చాయి ఈమెకి, అంత పెద్ద స్టార్ హీరోయిన్. 1956 వ సంవత్సరం లో వెండితెర అరంగేట్రం చేసిన సుకుమారి, సుమారుగా 700 సినిమాల్లో అన్నీ భాషలకు కలిపి నటించింది. అయితే ఈమె నేటి తరం ప్రేక్షకులకు కేవలం ముసలావిడ గా మాత్రమే తెలుసు. కానీ పసి వయస్సులో ఈమె ఎంత అందంగా ఉండేదో మీరే చూడండి ఈ క్రింది ఫోటోలలో.