Janhvi Kapoor : అలనాటి తార, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కుమార్తె జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఇప్పటికే అర డజన్ చిత్రాల్లో నటించిన ఈ మద్దుగుమ్మకు ఇంత వరకు సరైన హిట్ పడలేదు. కానీ, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్లతో జాన్వీ కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. అన్నట్లు త్వరలోనే ఈ అందాల సోయగం తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ప్రస్తుతం దేవర
అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక అయింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన తల్లి మరణం గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. జాన్వీ కపూర్ తన డెబ్యూ మూవీ ధడక్ షూటింగ్ సమయంలోనే శ్రీదేవి మరణించింది. అయితే అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోయానని.. ఆమె లేని లోటు ఎవ్వరు తీర్చలేనిదని జాన్వీ చెప్పుకొచ్చింది.
ఆ నెల మొత్తం అమ్మ లేరు అన్న బాధను భరించలేకపోయాను. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏదో ఒక పని చేస్తూ ముందుకు సాగడం కష్టంగా అనిపించింది. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు పెద్ద యుద్దమే చేశాను అంటూ జాన్వీ వాపోయింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక మరోవైపు జాన్వీ కపూర్ ‘బవాల్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫేమ్ వరుణ్ ధావన్ తో జాన్వీ జోడీకట్టింది. అయితే, సినిమా షూటింగ్ సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగిందట. వరుణ్ ధావన్ జాన్వీతో కలిసి నటించడం ఇదే మొదటి సారి. దీంతో సెట్లో వీరిద్దరూ కలిసిపోతారని మూవీ టీం భావించింది.
కానీ, వరుణ్ జాన్వీని అవాయిడ్ చేసేవాడట. తను మాట్లాడే ప్రయత్నం చేసినా పెద్దగా కలిసేవాడు కాదట. ఇలా నెల రోజుల వరకు జరిగింది. ఈ విషయాన్ని ఈ హీరో స్వయంగా చెప్పాడు. సినిమాల్లో వీరి పాత్రల స్వభావం ప్రత్యేకంగా ఉంటుందట. చలాకీ వ్యక్తులైన వీరిద్దరూ ఒక చోట చేరితే మంచి స్నేహితులైపోతారు.. అప్పుడు తమ నటనపై ఆ ఎఫెక్ట్ ఉంటుందని హీరో భావించాడట. అందుకే జాన్వీ ఏమనుకున్నా పరవాలేదనుకుని తనను దూరం పెట్టినట్టు చెప్పాడు.