Baby Movie : సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో, ఎప్పుడు ఫట్ అవుతుందో అర్థంకాని పరిస్థితి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నెలకొంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమ్ము దులుపుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీగా ఉంది.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ. సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఫస్ట్ ఆటకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఆనంద్, వైష్ణవి చిన్నతనంలో గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆనంద్ తన చదువుకు మధ్యలోనే పుల్ స్టాప్ పెడతాడు. అయితే మొదటి నుంచి చదువుపై ఆసక్తి ఉన్న వైష్ణవి ఉన్నత చదువుల కోసం ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
ఈ క్రమంలో తమ మధ్య ప్రేమ చెడిపోతుందనే భయంతో తను ఉపాధి అందించే ఆటోను అమ్మి రెండు ఫోన్లు కొంటాడు. అయినా వారి మధ్య దూరం క్రమంగా పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే నాలుగు గోడల మధ్య పెరిగిన వైష్ణవి ఒక్కసారిగా ప్రపంచంలోకి అడుగుపెట్టే సరికి నేటి తరానికి చాలా ఈజీగా ఆకర్షితురాలవుతుంది. బ్యూటీ పార్లర్.. ట్రెండీ మోడ్రన్ డ్రెస్సులు.. ఫారిన్ కల్చర్ కి అలవాటు పడుతుంది. అయితే ఆనంద్ దేవరకొండ మాత్రం ఆమె తన పాత వైష్ణవిగానే భావిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యలోకి ప్రవేశించిన విరాజ్ కథను మలుపు తిప్పుతాడు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటే యంగ్ హీరో లవ్ స్టోరీగా ప్రచారం జరుగుతుంది. ఈ యువ హీరో సాయి రాజేష్‌కి మంచి స్నేహితుడు కూడానట.. అందుకే అతని పేరు బయటకు రాకుండా ఈ సినిమా తీశారు. రియల్ స్టోరీ కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించిందని అంటున్నారు ప్రేక్షకులు.