Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, సమంతల లేటెస్ట్ మూవీ ఖుషి.. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌ని విడుదల చేశారు. పాట ఎలా ఉందనేది పక్కన పెడితే.. ప్రస్తుతం లిరికల్ వీడియోలో భాగంగా విడుదల చేసిన ఓ స్టిల్ మాత్రం బాగా వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ ఫోటోను మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఫోటోను చూసిన వారు సమంతను ట్రోల్ చేసేస్తున్నారు.

ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ ఓ సోఫాలో పడుకుని ఉన్నాడు. సమంత అతని కాళ్ల దగ్గర కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంది. అదే సమయంలో విజయ్ దేవరకొండ తన ఎడమ బొటన వేలితో సమంతను గీకుతాడు. మాంటేజ్ సాంగ్ కావడం వల్ల ఈ స్టిల్‌కి సినిమా కథకు పెద్దగా సంబంధం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ పాట ఎప్పుడైతై లైమ్ లైట్ లోకి వచ్చిందో వెంటనే మహేష్ అభిమానులు మాత్రం ఈ ఫోటోను వైరల్ చేశారు. దీనికి ఓ కారణం ఉంది. కొన్నేళ్ల క్రితం లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన వన్-నేనొక్కడినే మూవీ పోస్టర్ పై సమంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పోస్టర్‌లో మహేష్ బీచ్‌లో నడుస్తూ, అతని పాదముద్రలపై హీరోయిన్ పాకుతున్నట్లు చూపించారు. అది కూడా మాంటేజ్ సాంగ్ లో భాగంగా వచ్చిన ఫోటో.
కాకపోతే ఆ ఫోటో చూసి అప్పట్లో సమంత హర్ట్ అయ్యింది. ఆ పోస్టర్ చూసి నా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున రచ్చ కూడా జరిగింది. కానీ ఇన్నాళ్లుకు మళ్లీ సమంత ఇలా దొరికిపోయింది. అప్పట్లో మహేష్ బాబు పోస్టర్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండ కాళ్ల దగ్గర కూర్చొని తన పాదాలు తడితే మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. చూడాలి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో.. !