Samantha : సామాజిక మాధ్యమాలలో నాగచైతన్య సమంత ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు. వారిద్దరూ విడాకులు తీసుకుని రెండు సంవత్సరాలు అయినప్పటికీ నాగచైతన్య అభిమానులకు ఇంకా సమంతపై కోపం తగ్గలేదు. తాజాగా వైరల్ అయిన ఒక వార్త నాగచైతన్య అభిమానులకు సమంతపై కోపానికి కారణమైంది. అదేమిటంటే సమంత తల్లి నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నదట.సమంత మయోసైటిస్ అనే వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి ఆమె అభిమానులకు తెలిసిందే.
ఆ జబ్బు వచ్చిన కొత్తలో సమంత నీరసించి చిక్కిపోయినట్లు కనిపించేది. ఆ వ్యాధిని నయం చేసుకోవడం కోసం ఫారిన్ వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నది. ఆ సమయంలో సినిమాలకు విరామం ఇచ్చింది. ఎట్టకేలకు ఆ వ్యాధి నుండి కోలుకొని తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసింది. అయితే తాజాగా ఆ వ్యాధి తిరగబెట్టడంతో తాను తీసుకున్న అడ్వాన్స్ లన్నీ వెనక్కి ఇచ్చేసి ట్రీట్మెంట్ కోసం మరల ఫారిన్ వెళ్ళిందని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తల్లి నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటుందని, ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.
సమంత నాగచైతన్య కలిసి ఉన్న సమయంలోనే ఈ వ్యాధి వచ్చినప్పటికీ నాగచైతన్య సరైన శ్రద్ధ సమంతపై తీసుకోలేదని, అంతేకాక వారి మధ్య విడాకులు కూడా అవ్వడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్లిందని, ఆ కారణంగానే ఇప్పుడు మరల వ్యాధి పూర్తిగా బయటకు వచ్చిందని సమంత తల్లి చెప్పుకొని బాధపడుతోందట. ఈ కారణంగానే తన కూతురు ఆరోగ్యం పాడవడానికి నాగచైతన్య కారణమని అతనిపై లీగల్గా యాక్షన్ తీసుకోవాలని, సమంత తల్లి ప్రయత్నాలు మొదలుపెట్టిందట. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఈ వార్త ప్రచారంలో ఉంది.