Best Villains 2022 : 2022లో విలన్లుగా అదరగొట్టిన హీరోలు వీళ్లే

- Advertisement -

Best Villains 2022 : కొంతమంది హీరోలు తమ సినీ కెరీర్​ స్టార్టింగ్​లో విలన్లుగా నటించి ఆ తర్వాత క్రేజ్ సంపాదించుకుని హీరోలుగా మారారు. విలన్​గా ఎంతటి విలనిజం పండించారో.. హీరోగా అంతకుమించి హీరోయిజం చూపించారు. ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేశారు. అలా విలన్లు హీరోగా మారడమే కాదు.. హీరోలు కూడా విలన్లుగా మారిన సందర్భాలున్నాయి.

అయితే హీరోగా కెరీర్​ ఎస్టాబ్లిష్ అయ్యాక.. ఫ్యాన్​డమ్ క్రియేట్ అయ్యాక విలన్​గా నటించడమన్నది సాహసమనే చెప్పాలి.ఎందుకంటే.. ఇన్నాళ్లూ చెడుపై మంచిని గెలిపించడానికి పోరాడిన హీరో ఇప్పుడు చెడ్డవాడిగా కనిపిస్తే సడెన్​గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు. అలా హీరోలని విలన్లుగా యాక్సెప్ట్ చేయాలంటే ఆ పాత్ర చాలా స్ట్రాంగ్​గా ఉండాలి. అందుకే చాలా మంది హీరోలు ఇంతకుముందు విలన్​గా నటించడానికి వెనకాడేవారు. ఇమేజ్‌ లెక్కలు.. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అన్న అనుమానాలతో ఆ తరహా ప్రయోగాలకు దూరంగా ఉన్నారు.

ఇప్పుడు పరిస్థితులు మారాయి. హీరోయిజం చూపించాలంటే హీరో పాత్రలే చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు నేటి హీరోస్​. విలన్లుగా నటించి వెండితెరపై చెరగని ముద్ర వేస్తున్నారు. అలా ఈ ఏడాది 2022లో విలన్లుగా అదరగొట్టిన హీరోలు ఎవరు..? వారు చేసిన పాత్రలేంటో ఓసారి లుక్కేద్దామా..?

- Advertisement -
Best Villains 2022
Best Villains 2022

బాహుబలి‘లో భళ్లాలదేవగా శక్తిమంతమైన ప్రతినాయక పాత్రలో కనిపించి.. ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో రానా. ఆయన ఈసారి ‘భీమ్లానాయక్‌’ కోసం విలన్‌గా మారారు. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది. ఇందులో డానీ అలియాస్‌ డేనియల్‌ శేఖర్‌గా ప్రతినాయక ఛాయలున్న పాత్రతో ప్రేక్షకుల్ని అలరించారు రానా. పతాక సన్నివేశాల్లో ఆయన.. పవన్‌ కొదమ సింహాల్లా తలపడిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది.

Sanjay dut and suriya

ఇక ‘విక్రమ్‌‘లో రోలెక్స్‌ అనే ప్రతినాయకుడిగా కనిపించి.. ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు కథానాయకుడు సూర్య. సినిమా ఆఖర్లో వచ్చే ఆ పాత్ర తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన విలనిజంతో ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేశారు సూర్య. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. దీనికి సీక్వెల్‌గా త్వరలో ‘విక్రమ్‌2’ రానుంది. అందులో రోలెక్స్‌ – విక్రమ్‌ల పోరు పూర్తిస్థాయిలో చూసే అవకాశముంది. అంతేకాదు త్వరలో రోలెక్స్‌ పాత్రపైనే ఓ చిత్రం తెరకెక్కించేందుకు లోకేష్‌ సన్నాహాలు చేస్తున్నారు.

రొటీన్‌ విలన్లను చూసి విసుగెత్తిన ప్రేక్షకులకు ‘కేజీఎఫ్‌2‘, ‘విక్రమ్‌’ చిత్రాలు సరికొత్త విలనిజాన్ని రుచి చూపించాయి. యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రమే ‘కేజీఎఫ్‌2’. ఈ సినిమాతోనే ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించారు బాలీవుడ్‌ కథానాయకుడు సంజయ్‌ దత్‌. ఆయనిందులో అధీరాగా భీకరమైన అవతారంలో.. ఆసక్తికరమైన విలనిజంతో సినీప్రియుల్ని మెప్పించారు. సినిమాలో ఆయన పరిచయ సన్నివేశాలు.. హీరో యష్‌తో తలపడే ఘట్టాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి.

గ్యాంగ్‌లీడర్‌‘ చిత్రంతో తెరపై తొలిసారి విలన్‌గా మెరిశారు యువ హీరో కార్తికేయ. ఈ ఏడాది విడుదలైన ‘వలిమై’లో మరోసారి ప్రతినాయకుడిగా కనిపించి మురిపించారు. అజిత్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను హెచ్‌.వినోద్‌ తెరకెక్కించారు. ఆయన ఇందులో కార్తికేయను నరేన్‌ అనే శక్తిమంతమైన విలన్‌గా ఆకట్టుకునేలా చూపించారు. సినిమాలో అతనికీ అజిత్‌కు మధ్య సాగే మైండ్‌ గేమ్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

nani

‘సరైనోడు’లో వైరం ధనుష్‌గా అల్లు అర్జున్‌తో తలపడ్డారు కథానాయకుడు ఆది పినిశెట్టి. ఈసారి ఆయన ‘ది వారియర్‌’ కోసం గురు అనే మరో శక్తిమంతమైన విలన్‌గా మారారు. రామ్‌ హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రమిది. సినిమాలో రామ్‌ – ఆదిల మధ్య పోరాటం ‘నువ్వా – నేనా’ అన్నట్లుగానే సాగుతుంది. ఆ వైరాన్ని తెరపై ఎంతో ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఆవిష్కరించారు లింగుస్వామి.

గాడ్‌ఫాదర్‌’లో జైదేవ్‌ దాస్‌ అనే పవర్‌ఫుల్‌ విలన్‌గా చిరంజీవితో తలపడి మెప్పించారు యంగ్ హీరో సత్యదేవ్. మలయాళంలో విజయంతమైన ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. చిరంజీవి లాంటి అనుభవమున్న హీరోకి ఎదురుగా విలన్‌గా నిలబడటం అంత సులభం కాదు. కానీ, సత్యదేవ్‌ తన ప్రతిభతో ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here