Ashish Vidyarthi ఒకానొక టైంలో వరుస సినిమాలతో తెలుగు తెరపై సంచలనంగా మారిన ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేసిన పోకిరి సినిమాతో విలన్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర హైలెట్ అయింది. ఈసినిమాతో ఆశిష్ విద్యార్ధి విలన్ గా తిరిగి చూడాల్సిన పనిలేదు. అటు విలన్ గా చేస్తూనే క్యారెక్టర్ ఆరిస్ట్ గా కమెడియన్ గా మెరిశారు. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే సీనియర్ హీరోలు – హీరోయిన్లు తమ కొత్త లైఫ్ స్టార్ చేయడానికి.. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రిపరెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉండే కొందరు 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నారు. వారి లిస్ట్ లోకే ఆశిష్ విద్యార్థి చేరిపోయారు.
ఆయన రీసెంట్ గా 57 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ముందే ఆశిష్ విద్యార్థికి పెళ్లయింది.. ఓ బాబు కూడా ఉన్నాడు. వారి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలీ బరువాను ఇష్టపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. కోల్కతాలో ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. రీసెంట్గా హనీమూన్ కోసం వారిద్దరు ఇండోనేషియాలో ఉన్న మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ బాలి కి వెళ్లారు. వారు హనీమూన్లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. 60ఏళ్లు వచ్చాయి.. అమ్మ అయ్యా అనాల్సిన వయసులో నీకు హనీమూన్ అవసరమా..? అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పోకిరి విలన్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.