Anand Deverakonda : అన్న బాటలోనే తమ్ముడు ఆ హీరోయిన్ తో ప్రేమాయణం.. ఆమె చాలా స్పెషల్ అట

- Advertisement -

Anand Deverakonda రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అతని గత చిత్రం లైగర్ డిజాస్టర్ గా నిలిచింది. అన్న బాటలోనే తమ్ముడు కూడా ఆమెరికాలో కొంతకాలం జాబ్ చేసి సినిమాల‌పై ఇంట్రెస్ట్ తో జాబ్ వ‌దిలేసి ఇండియాకు వ‌చ్చేశాడు. దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోయిన తన తదిపరి సినిమాలు.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం చిత్రాల‌తో మంచి సక్సెస్ అందుకున్నాడు.

Anand Deverakonda
Anand Deverakonda

ప్ర‌స్తుతం ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇందులో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా న‌టించింది. విరాజ్‌ అశ్విన్ మరో కీలక పాత్ర పోషించాడు. జులై 14న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ మొదలు పెట్టింది. అయితే ఆనంద్ యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక వీరిద్దరు గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో కలిసి న‌టించారు. ఆ టైంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడింది.. అది కాస్త ముదిరి ప్రేమగా మారిందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ ను ప్రశ్నించగా `వర్ష నాకు బెస్ట్ ఫ్రెండ్. అందుకు మించి ఏమీ లేదన్నాడు.. అంతే కాకుండా తామిద్దరం డాగ్ లవర్స్ అని.. ఎక్కువగా వారిద్దరి మధ్య కుక్కల గురించే మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చాడు. అలా కుక్కల గురించి మాట్లాడుకుంటూనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారట. తనకు వర్ష చాలా స్పెషల్ ఫ్రెండ్ అంటూ చెప్పాడు. అంతే కానీ తనపై ప్రేమ దోమ లాంటివి లేవని స్పష్టం చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here