Nirmalamma నిర్మలమ్మ.. ఈవిడ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లదు. తన అసలు పేరు నిర్మల అయినా ఆమెను అందరూ అమ్మ అని పిలవడంతో నిర్మలమ్మగా మారిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరీకి అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా నటించి అందరికీ సుపరిచితం అయ్యారు. కొన్ని చిత్రాల్లో ఆమె చేసిన బామ్మ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తాను నిలిచిపోయారు. నిర్మలమ్మ ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో జీవించేంది. ఇక నిర్మలమ్మ సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో నటించింది.
తరువాతే సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రొడక్షన్ మేనేజర్ జీవీ కృష్ణారావు ఓ సినిమా షూటింగ్ లో నిర్మలమ్మను చూసి ప్రేమలో పడ్డాడు. నిర్మలమ్మ సినిమా షూటింగుల్లో చాలా పద్దతిగా ఉండేవారు. అందుకే కృష్ణారావు తన ప్రేమ సంగతి ఆమెకు చెప్పకుండా.. నిర్మలమ్మ ఇంటికి వెళ్లి వాళ్ల తండ్రితో పెళ్లి విషయం మాట్లాడారు. ఆ పెళ్లికి అందరూ ఒప్పుకున్నా.. నిర్మలమ్మ మాత్రం నో అన్నారు. దీనికి కారణం కూడా లేక పోలేదు. తాను నటనకు దూరం కావాల్సి వస్తుందన్నది ఆమె భయం.. అప్పుడే పెళ్లి చేసుకోవాలంటే కృష్ణారావుకి ఓ కండీషన్ పెట్టారు నిర్మలమ్మ.
నిర్మలమ్మ షరతులకు జీవి కృష్ణారావు ఒప్పుకున్నారు. ఇష్టపడి పెళ్లయితే చేసుకున్నారు కానీ వారికి పిల్లలు కలుగలేదు. దీంతో నిర్మలమ్మ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఆ టైంలో సినిమాలకు దూరమయ్యారు. కృష్ణారావుకి కూడా ప్రొడక్షన్ మేనేజర్ గా అవకాశాలు సన్నగిల్లాయి. ఆదాయం లేదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ప్రేమ సినిమాలో అవకాశం రావడంతో నిర్మలమ్మ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది..
అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, చిరంజీవి, రాజశేఖర్ అందరి సినిమాల్లో నటించింది. వారందరికీ అమ్మగా.. బామ్మగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. నిర్మలమ్మ ఒక ఆడ పిల్లను దత్తత తీసుకుంది. ఆమె పెళ్లి చేయగానే చెన్నై వెళ్లిపోయింది. నిర్మలమ్మ హైదరాబాద్లో ఒంటరిగా గడిపేది. చివరి దశలో ఆమె కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితం అయింది. ఎంతలా అంటే చీమలు కుట్టినా కదలలేని స్థితిలో ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.