Ileana: త్వరలోనే డెలివరీ.. ఆ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న గోవా బ్యూటీ ఇలియానా

- Advertisement -

Ileana: దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అందం ఇలియానా. ఆ సినిమాలో తన నడుము ఒంపులతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ ప్రెగ్నెంట్ అన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ అమ్మడు తను ప్రెగ్నెంట్ అన్న విషయం అనౌన్స్ చేసింది. ఈ ముద్దుగుమ్మకు పెళ్లికాలేదు. వివాహం కాకుండానే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఓ అజ్ఞాత వ్యక్తితో సహజీవనం చేస్తుందని తెలుస్తోంది.. దీంతో అమ్మడి కడుపు పండింది. ప్ర‌స్తుతం ఆ అజ్ఞాత వ్యక్తితోనే ఇలియానా ఉంటున్నట్లు సమాచారం. అంతే కాకుండా తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

Ileana
Ileana

అయితే ఇంత వ‌ర‌కు ఆమె ఆ అజ్ఞాత వ్యక్తి ఎవ‌రో చెప్పలేదు. సోష‌ల్ మీడియా ద్వారా బాయ్ ఫ్రెండ్ తో గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాల‌ను పంచుకుంటున్నట్లు తెలుపుతూ.. స‌ద‌రు వ్య‌క్తి ఎవరనేది చెప్పకనే చెప్పకుండా ఫేస్ దాచేస్తోంది. అలాగే బాయ్ ఫ్రెండ్ గురించి కొద్ది రోజుల క్రితం చాలా గొప్పగా కీర్తించింది. తాను కష్టనష్టాల్లో అతడు తోడున్నాడని, బాధ నుండి బయటపడేలా చేశాడని, అండగా నిలిచాడని.. జీవితంలో తన వల్లే ప్రస్తుతం నవ్వగలుగుతున్నానని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇలియానా తొమ్మిదో నెల‌లోకి అడుగు పెట్టింది. ఈ నెల చివ‌ర్లో ముద్దుగుమ్మ డెలివ‌రీ జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఓ సమస్యతో పోరాడుతున్నట్లు దాని గురించి సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. తొమ్మిదో నెల‌లో తనను నీరసం తీవ్రంగా వేధిస్తుందని పేర్కొంది. దాంతో ఏ ప‌ని చేయ‌లేక‌పోతున్నాన‌ని ఇలియానా తన ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేసింది. అది కాస్త వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు ఆరోగ్యం ప‌ట్ల తనకు స‌ల‌హాలు, సూచ‌నలు ఇస్తున్నారు. మ‌రికొందరేమో పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని అడుగుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here