Manchu Manoj : నటుడు మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరొసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మనోజ్ తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలే వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ మ్యారేజ్ జరిగింది. మోహన్ బాబు దంపతులు, మంచు విష్ణు సహా పలువురు బంధువులు, సన్నిహితులు శ్రేయోభిలషులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజానికి మనోజ్ – మౌనిక రెడ్డిల పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సోదరుడు విష్ణు సైతం తమ్ముడి వివాహం పట్ల ఆసక్తి కనబరచలేదని టాక్ వచ్చింది. పెళ్ళి వ్యవహారాల్లో ఎక్కడా కూడా మోహన్ బాబు – విష్ణు కనిపించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరేలా చేసింది.

అయితే, మోహన్ బాబు మధ్యలో ఒకసారి కనిపించి.. పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని టాక్. మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహ బాధ్యత భుజాన వేసుకొని అన్నీ సవ్యంగా జరిపించింది. తల్లిదండ్రులు దీనికి దూరంగా ఉండగా.. తానే పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ.. దగ్గరుండి పనులు చూసుకుంది. తమ్మున్ని పెళ్లి కొడుకును చేయడంతో పాటు మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసే వరకు అన్ని బాధ్యతలు నిర్వహించింది. అలానే తన తండ్రి సోదరుడితో మాట్లాడి మనోజ్ పెళ్ళికి వచ్చేలా చేసిందని కూడా చేసింది. ఆ తర్వాత వారిని తిరుమల తిరుపతికి కూడా తీసుకెళ్లింది లక్ష్మి. తాజాగా వాళ్ళు పిల్లల్ని కనే విషయంపై కూడా అసలు విషయాన్ని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా మంచు లక్ష్మి మాట్లాడుతూ యాదాద్రి వెళ్ళినప్పుడు మనోజ్ కి మౌనికకు పెళ్లి చేసేయ్ దేవుడా.. నావల్ల కావడం లేదు..మా నాన్నని ఒప్పించండి అని అన్నాను.. కానీ ఏమైందో తెలియదు కానీ స్వామి దయతో నాన్న ఒప్పుకున్నారు.. వీరి పెళ్లి జరిగిపోయింది అని తెలిపింది. అందుకే మళ్ళీ వాళ్ళను యాదాద్రి తీసుకెళ్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దర్శనం చేయించాను.. అంటూ తెలిపింది మంచు లక్ష్మి. ఇప్పుడు మౌనిక నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. మనోజ్ కంటే నాకు మౌనికనే ఎక్కువ.. ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది.. ఓపిక ఎక్కువ.. కూల్ గా ఉంటుంది.. మంచిగా ఆలోచిస్తుంది.. చాలా చిన్న పిల్ల అందుకే ఇంటి రెస్పాన్సిబిలిటీ ఏమీ వద్దు .. అర్జెంటుగా ఒక బేబీని కనీ ఇవ్వమని చెప్పాను.. మా ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా మాకు సరిపోరు.. నా కూతురితో పాటు మరో అయిదు ఆరుగురు పిల్లలు మా ఇంట్లో ఎప్పుడూ ఉంటారు. నేను కూడా ఇంకో నలుగురిని కనాలని అనుకున్నాను కానీ కుదరలేదు.. దేవుడు సహకరించలేదు.