మెగా ఫ్యామిలీ చేసిన తప్పుకు నిహారిక జీవితం బలైందా..

- Advertisement -

ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు నిహారిక, చైతన్య. 2020 డిసెంబర్‌లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలా పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి జరిగింది. అప్పట్లో నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసిందంటే ఏ రేంజ్‌లో వీళ్ళ పెళ్లి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తుంది.

నిహారిక
నిహారిక

చైతన్య సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్ కావడం.. నిహారిక సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు ఎక్కువగా వచ్చాయని ప్రచారం జరుగుతుంది. అందుకే కొన్ని రోజులు కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నా కూడా పరిష్కారం కాకపోవడంతో చివరికి విడాకుల బాట పట్టారు ఈ ఇద్దరు. అధికారికంగా విడాకులు ఇప్పుడు మంజూరు అయ్యాయి.. కానీ చాలా రోజులుగా వీళ్ళు ఇద్దరు వేరువేరుగానే ఉంటున్నారు. అందుకే నిహారిక మునుపటిలా మళ్ళీ సినిమాలు చేస్తూ, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఫోటోషూట్స్ కానీ, సినిమాలు గానీ ఏమీ చేయలేదు నిహారిక. దీన్ని బట్టి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి నిహారిక ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి ఉంటాయని వార్తలు వ్యాపిస్తున్నాయి.

niharika

ఇక విడాకుల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న వేళ మెగా ఫ్యామిలీ చేసిన తప్పు వల్లే నిహారిక జీవితం బలైంది అంటూ మరొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్ లు, ఫోటోషూట్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అసలు తప్పు ఎక్కడోచ్చి పడిందంటే..వీరి పెళ్లి అనుకున్న టైం కి జరగలేదట. నిహారిక చైతన్య జాతకాల ప్రకారం పెట్టిన ముహూర్తానికి మెగా ఫ్యామిలీ వీరి పెళ్లి జరిపించలేదట. ఫోటోషూట్స్ కారణంగా తాళి కట్టే టైం మారిపోయిందట. ఇక ఆ తప్పు వల్లే నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు అంటూ మరో వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here