నిన్నటి నుంచి మెగా డాటర్ నిహారిక పేరు మారుమోగిపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా.. టీవీ, ప్రింట్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఆమె విడాకుల ముచ్చట్లే. మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంటుందా ..? లేదా..? ఎందుకు దూరంగా ఉంటుంది..? అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్ధానికి ఎందుకు నిహారిక భర్తతో రాలేదు..? నిహారిక అత్తింటి ఫ్యామిలీ ఎందుకు బయట కనిపించడం లేదు ..? అంటు రకరకాలుగా మాట్టాడుకుంటున్నారు. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ నిహారిక.. చైతన్య నిజంగానే విడాకులు తీసుకున్నారని .. ఇకపై వాళ్లు భార్యాభర్తలు కాదు అని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. దీనికి రుజువంటూ వీళ్లిద్దరూ విడాకులు అప్లై చేసిన డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల హైదరాబాదులోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్లిద్దరికి విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. గత 24 గంటల నుంచి ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పటివరకు వారిద్దరూ దీనిపై అఫీషియల్గా ప్రకటించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ నిహారిక పై జాలిపడాలో ..? తిట్టాలో..? తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయారు. అయితే నిహారిక విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ అంటూ వార్త గుప్పుమంటోంది.
అవును తాను మరెవరో కాదు మాజీ అక్కినేని ఇంటికోడలు.. సమంత . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన నటనతో పేరు సంపాదించుకున్న సమంత భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిహారిక తనను ఇన్సిపిరేషన్ గా తీసుకొని నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి సమంతాను ఇష్టపడే నిహారిక ఆమె మ్యారీడ్ లైఫ్ లో వచ్చిన రిజల్ట్ ని కూడా అదే విధంగా అప్లై చేసుకుందని ..ఇది నిహారిక జీవితంలోనే తప్పుడు నిర్ణయం అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.