నిహారిక విడాకులు.. ఆఫిషియల్ గా చెప్పేశారుగా..

- Advertisement -

చాలారోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడిపోయింది. అతనితో విడాకుల ప్రక్రియ తాజాగా పూర్తయింది. కోర్టు ఈ మధ్యే ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. అయితే వీళ్లు విడిపోవడానికి కారణమేంటో తెలియలేదు. కొన్నాళ్లుగా నిహారిక, చైతన్య మధ్య మనస్పర్దలు రావడంతో వీళ్లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

నిహారిక
నిహారిక

ఇప్పుడు అధికారికంగా తెలిసిపోయింది. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పర విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. కోర్టు కూడా వీరికి విడాకులు మంజూరు చేసినంది. నిహారిక- చైతన్యలు 2020 డిసెంబర్‌ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రెండేళ్లకే వీరి పెళ్లి బంధం పెటాకులైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు.

Niharika

ఇక ఆ మధ్యన చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. దీంతో వీరి బ్రేకప్‌ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు నిహారిక కూడా చైతన్య ఫొటోలన్నింటినీ తొలగించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లు, ఫంక్షన్లకు నిహారిక సింగిల్‌గా రావడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడీ రూమర్లే నిజమయ్యాయి. నిహారిక- చైతన్య దంపతులు అధికారికంగా విడిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here