ఆ రాత్రి జరిగిన సంఘటన కారణంగానే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని దూరం పెట్టేసాడా..? వాళ్ల మధ్య ఇంత కథ నడిచిందా!

- Advertisement -

పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ టూర్ ప్రారంభమైనప్పటి నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి చాలా తీవ్రమైన వ్యతిరేకత రావడం మొదలైంది. అంతకు ముందు సోషల్ మీడియా లో పాలు నీరు లాగ కలిసి మెలిసి ఉండే పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద చిచ్చు రగులుకుంది. ఎందుకంటే ‘వారాహి విజయ యాత్ర’ లో పవన్ కళ్యాణ్ ప్రతీ నియోజక వర్గం లో మన స్టార్ హీరోల అభిమానులందరినీ జనసేన పార్టీ కి ఓటు వేయాల్సిందిగా కోరుతూ వచ్చాడు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు ప్రభాస్ పేర్లను ప్రస్తావిస్తూ మరీ అడిగాడు. కానీ ప్రతీ చోట అల్లు అర్జున్ పేరు ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు, కేవలం ఒక్క చోట మాత్రమే అల్లు అర్జున్ పేరుని తీసుకొచ్చాడు. మిగిలిన ప్రతీ చోట ఆయన నితిన్ , రవితేజ లాంటి హీరోల పేర్లను కూడా ప్రస్తావించాడు కానీ, అల్లు అర్జున్ పేరుని మాత్రం ప్రస్తావించలేదు.

ఒకసారి అంటే అనుకోవచ్చు, కానీ ప్రతీ సభలో ఇలాగే అల్లు అర్జున్ పేరు ని ఎత్తడం లేదంటే, కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఎదో మనస్పర్థలు ఏర్పడి ఉంటాయని అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, పుష్ప మూవీ పెద్ద హిట్ అయ్యినప్పుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీ లో తనకి బాగా పరిచయం ఉన్నవాళ్ళని పిలిచి పార్టీ ఇచ్చాడు.

- Advertisement -

ఈ పార్టీ లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మరియు పవన్ కళ్యాణ్ ని చాలా తక్కువ చేసి మాట్లాడాడని, ఈ విషయం రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిందని, అప్పటి నుండి వాళ్లిద్దరూ అల్లు అర్జున్ ని దూరం పెట్టేశారని టాక్. అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు రామ్ చరణ్ ఎదో మొక్కుబడిగా ట్వీట్స్ వెయ్యడం, పవన్ కళ్యాణ్ ఇలా అల్లు అర్జున్ పేరు ని తన సభలలో కావాలని చెయ్యడానికి కూడా కారణం అదేనని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here