చేతులారా కెరీర్ నాశనం చేసుకుంటున్న హనీరోజ్..

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోలు మంచి నేమ్ తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ హీరోయిన్స్ కి కొంచెం గ్లామర్ తోడై అదృష్టం బాగుంటే.. వెంటనే మంచి నేమ్ వస్తుంది. అలాంటి వారిలోనే హనీ రోజ్ కూడా ఒకర్తి.. పెద్దగా సక్సెస్ సాధించకపోయినా ఆమె కంటూ ఒక క్రేజ్ బాగానే సంపాదించుకుంది. మలయాళీ నటి అయిన హనీ రోజ్ అనేక సినిమాల్లో నటించినప్పటికీ.. పెద్దగా పేరు రాలేదు కానీ బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించిన తర్వాత ఆమెకు మంచి నేమ్ వచ్చింది.

Honey Rose
Honey Rose

బావ మనోభావాలు దెబ్బతింటాయి అనే పాటతో ఆమెకి ఇంకా క్రేజీ పెరిగింది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మా బావ మనోభావాలు దెబ్బతింటాయి అనే పాటతో ఆమె అందాలను ఆరబోస్తూ..రెచ్చిపోయి వేసిన డాన్స్ ఇప్పటికీ కుర్రకారుని ఎర్రెక్కిస్తుంది. కేవలం కొన్ని షాపింగ్ మాల్స్ ఈవెంట్లకు వెళ్లి అక్కడ అట్రాక్షన్ గా నిలుస్తోంది.జనాలు ఆమెని చూడటానికి ఎగబడుతున్నారు. ప్రేక్షకులలో అయితే హనీ రోజ్ కి స్పెషల్ క్రేజ్ పెరిగిందనే చెప్ప వచ్చు. ఈ అమ్మడికి క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు మాత్రం రావటం లేదు. అందుకు కారణం హనీ రోజ్ ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

honey rose

దాదాపు రూ.3 నుండి రూ.4 కోట్ల మధ్యలో రెమ్యునేషన్ అడుగుతోందట. కానీ నిర్మాతలు ఈమెకి ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వటానికి సిద్ధంగా లేరని సమాచారం. అయితే ఆమెకు ఒక కోటి రూపాయలైతే ఇవ్వటానికి మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో అయితే హనీ రోజ్ కి అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి అనిపిస్తోంది.. కానీ మలయాళం ఇండస్ట్రీలో ఈ అమ్మడికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో హానీ రోజ్ ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here