మాస్ మహారాజా రవితేజకు సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సహాయం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రవితేజ. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎలాంటి సాయం లేకుండా స్టార్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజకు బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎలాంటి సాయం అందలేదు.

తనదైన టాలెంట్‌తో మాస్ హీరోగా ఎదిగిన రవితేజ ప్రస్తుతం కెరీర్లో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నా ఒక్క హిట్ కూడా అతని ఖాతాలో చేరడం లేదు. ఈ క్రమంలో ఆలోచించి నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తున్న రవితేజ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు. “చాలా కాలం తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నాను” అంటూ సామజవరగమన సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో రవితేజ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘అంటే రవితేజ ఇన్నాళ్లూ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడా..? మీకు మనశ్శాంతి అవసరమా? అందుకే ఈ సినిమా చూసి నవ్వుకున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నాడా..? అంటూ ఫ్యాన్స్ ఖంగుతింటున్నారు. అంతే కాదు రవితేజ ఇంతవరకు ఎందుకు హిట్ కొట్టలేకపోతున్నాడంటూ చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రవితేజ లేటెస్ట్ ట్వీట్ లో రవితేజ కూడా లోలోపల బాధపడుతున్నాడని తెలుస్తుంది. మరి రవితేజ ఎప్పుడు హిట్ కొడతాడో, అభిమానులను ఎప్పుడు అలరిస్తాడో చూడాలి..?