రాజమౌళి ఆ హీరోయిన్ ని ఇంతలా ప్రేమించాడా ?..ఆమె కోసం గోడలు దూకి మరీ తన్నులు కూడా తిన్నాడా!

- Advertisement -

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేసి, నేడు టాలీవుడ్ అంటే హాలీవుడ్ సైతం వణికిపోయేలా చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని శాసించిన ఆయన, ఇప్పుడు #RRR చిత్రం తో పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని శాసించి, ఆస్కార్ అవార్డుని కూడా తెచ్చిపెట్టాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు మన తెలుగు సినిమాకి దక్కింది అంటే, అది మనం ఎంత గర్వించదగ్గ విషయం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

రాజమౌళి
రాజమౌళి

అలాంటి రాజమౌళి గురించి ఎంతసేపు ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఇక అతని జీవితం లో సగభాగమైన రమా రాజమౌళి, రాజమౌళి వృత్తిలో కూడా సగభాగమై, కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రతీ సినిమాకి పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రమ కి రాజమౌళి తో జరిగినది మొదటి పెళ్లి కాదు, రెండవ పెళ్లి. ఆమె కొడుకు ‘కార్తికేయ’ కూడా మొదటి భర్త కొడుకు, అయ్యినప్పటికీ రాజమౌళి తన సొంత కొడుకుగా స్వీకరించాడు.

rajamouli

ఇది ఇలా ఉండగా రాజమౌళి రమ గారిని పెళ్లి చేసుకోక ముందు ఒక స్టార్ హీరోయిన్ ని ఎంతగానో ప్రేమించాడట. ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడ దూరి ఆమె తో కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పరితపించేవాడట. ఒకసారి షూటింగ్ కి వెళ్లి కలవాలని చూస్తే ఆరోజు ఆమెకి షూటింగ్ లేదు, దీనితో రాజమౌళి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి కలవాలి అనుకున్నాడట. సెక్యూరిటీ లోపలకు అనుమతించకపోవడం తో అక్కడే కాసేపు ఎదురు చూసి, ఆ తర్వాత ఆమె ఇంటి గోడని దూకి లోపలకు వెళ్లే ప్రయత్నం చేసాడట. ఇది గమనించిన సెక్యూరిటీ రాజమౌళి ని చితకబాదాడు అట.

- Advertisement -
rajamouli valli

అతను ప్రముఖ రచయితా విజయేంద్ర ప్రసాద్ కొడుకు అని, కీరవాణి ఇతనికి సోదరుడు అవుతాడనే విషయం ఆ సెక్యూరిటీ గార్డ్ కి తెలియదు. అందుకే కొట్టాడు. ఇంతకీ రాజమౌళి అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరో కాదు, అది రమ్య కృష్ణ. ఆమె అంటే చిన్నప్పటి నుండి రాజమౌళి కి ఒక క్రష్ అట. ఒక హీరోయిన్ ని కోట్లాది మంది అభిమానులు ప్రేమిస్తుంటారు, వారిలో ఒకరే రాజమౌళి, అంతే కానీ దీనికి వేరే అర్థాలు లేవు. అంతలా అభిమానించిన ఆ హీరోయిన్ తో రాజమౌళి సింహాద్రి మరియు బాహుబలి సిరీస్ చేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here