యాంకర్ అనసూయ ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే.. ఆమె గురించి ఆమె డేర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకరు ఒక మాట అంటే అస్సలు ఊరుకోదు.. ఈ విషయం చాలాసార్లు నిరూపించబడింది.. ఇప్పుడు మరోసారి నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. అందుకు సంబందించిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ నెటిజన్ కి మాస్ కౌంటర్ ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది..

గతంలో నెటిజెన్స్ మీద ఆమె మండిపడ్డారు. తనపై విమర్శలు చేసినందుకు కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా అనసూయను సంబంధం లేని వివాదం లాగిన ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఆమె సోషల్ మీడియాలో జీవ హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బక్రీద్ పండగ సందర్బంగా జంతువుల బలికి వ్యతిరేకంగా రష్మీ ట్వీట్స్ చేశారు. వ్యాపారం పేరుతో జీవహింస అనుక్షణం జరుగుతుంది. మీకు మా పండగ రోజు మాత్రమే జరిగే హింస మాత్రమే కనిపిస్తుందా అంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ జీవ హింస వ్యవహారం కాస్త హిందూ-ముస్లిమ్స్ విబేధాలకు వెళ్ళింది..
ఈ చర్చలోకి అనసూయను లాగారు.. రష్మీ లాగా సమాజం గురించి అనసూయ అస్సలు పట్టించుకోదు..అంత ధైర్యం లేదు అంటూ రష్మీ పోస్ట్ కు కామెంట్ చేశాడు.. ఇలాంటి విషయాలు మీద మాట్లాడదు అంటూ కామెంట్ చేశాడు. దానికి తాజాగా అను రియాక్ట్ అయ్యారు. ‘అవును ఇలాంటి విషయాల మీద మాట్లాడేందుకు నాకు బాల్స్ లేవు. కానీ తెలిసిన అంశాల మీద మాట్లాడేందుకు వజీనా ఉంది. అయినా ప్రతి ఒక్కరు ప్రతి అంశం మీద స్పందించాల్సిన అవసరం లేదు, అంటూ బోల్డ్ ట్వీట్ చేసింది.అనసూయ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది..