సోషల్ మీడియా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఫాలోయింగ్ మరియు రీచ్ ఏ స్టార్ హీరో కి కూడా లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వేరే లెవెల్ లో రీచ్ అయిపోతూ ఉంటుంది. ఆయన తన సోషల్ మీడియా ని ఎక్కువగా రాజకీయాల కోసమే వాడుతుంటాడు. సినిమా గురించి ఒక్క పోస్టు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు.
కేవలం పొలిటికల్ కంటెంట్ వాడినప్పటికీ కూడా ఆయనకి రీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అదే సినిమా కంటెంట్ కోసం వాడితే , పొలిటికల్ కంటెంట్ కంటే నాలుగు రెట్లు రీచ్ ఉంటుంది. కానీ తన అవసరాల కోసం ఉపయోగించడు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతాడు. ఇప్పటికే ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లో ఉన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు అతి త్వరలోనే ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.
ఈ విషయాన్నీ స్వయంగా మెగా బ్రదర్ నాగబాబు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అధికారికంగా తెలియచేసాడు. సోషల్ మీడియా లో ఉన్నటువంటి అన్నిటిలోకి ఇంస్టాగ్రామ్ అత్యంత రీచ్ ఉన్న పవర్ ఫుల్ మీడియా. ఇక్కడ ఏ పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధి లోనే లక్షల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వచేస్తుంటాయి. మహేష్ బాబు , ప్రభాస్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , చిరంజీవి ఇలా అందరూ స్టార్ హీరోలు కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని చాలా కాలం నుండి ఉపయోగిస్తున్నారు.
ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే దీనికి ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఇంస్టాగ్రామ్ కూడా అదనంగా తోడు అవ్వడం తో జనసేన పార్టీ కి మరింత బలం రాబొయ్యే రోజుల్లో చేకూరబోతుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సౌత్ ఇండియా లో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ప్రారంభించిన 99 నిమిషాల్లో 1 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ని దక్కించుకున్న హీరో ఇలయథలపతి విజయ్. ఇప్పుడు ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.