తెలుగులో ‘శ్రీ’ సినిమా చేసే సమయానికి తమన్నా కు కేవలం 16 సంవత్సరాల వయసే. అలా ప్రారంభమై 20 సంవత్సరాల కెరీర్ పూర్తిచేసుకుంది. ప్రారంభంలో చిన్న సినిమాలు చేసినప్పటికీ తర్వాత అగ్ర కథానాయకులందరితో నటించి పెద్ద రేంజ్ కు వెళ్లిపోయింది. దక్షిణాదిలో బిగ్గెస్ట్ హీరోయిన్లలో ఒకరుగా పేరు తెచ్చుకుంది. కెరీర్లో ఎక్కువగా గ్లామర్ రోల్సే చేసినప్పటికీ.. హద్దులు దాటి అందాలు ఆరబోసింది కూడా ఏమీ లేదు.

ఇంటిమేట్ సీన్లలో అసలు నటించలేదు. లిప్ లాక్ సీన్ కూడా చేయలేదు. తనకంటూ కొన్ని నియమ నిబంధనలను పెట్టుకొని వాటిని ఫాలో అయింది. అయితే సుదీర్ఘమైన రెండు దశాబ్దాల కెరీర్ పూర్తయిన తర్వాత తాను విధించుకున్న రూల్స్ అన్నింటినీ తమన్నా బ్రేక్ చేసింది. వారాల వ్యవధిలో విడుదలైన రెండు వెబ్ సిరీస్‌ల్లో తమన్నా రెచ్చిపోయింది. ఒకటి ‘జీ కర్దా’ కాగా.. మరొకటి ‘లస్ట్ స్టోరీస్’.
ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన తమన్నా.. తన చిన్ననాటి సంగతులను, కెరీర్ ప్రారంభ రోజుల్లో జరిగిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తాను చదువుకునే రోజుల్లో దాదాలా ఉండేదని చెప్పింది. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఓ నిర్మాత నాతో చెప్పిన విషయం నాకింకా గుర్తుంది. సినిమాలో నేనేం చేసినా స్త్రీ లాగానే ఉండాలన్నారు. తమాషా విషయమేమిటంటే ఆ సినిమా వల్ల ఓ అమ్మాయి ఎలా నడుస్తుందో అలా నడవడం నేను నేర్చుకున్నాను. మొదటి రోజు షూటింగ్‌కు వెళ్లగానే కొన్ని సన్నివేశాలు అయ్యాక నిర్మాత నాతో ‘మీరు అబ్బాయిలా నడుస్తున్నారు. అమ్మాయిలా నడవడానికి ప్రయత్నించండి’ అని అన్నారు. అలా నడవడం నాకు రాదు మీరే నేర్పండని వాళ్లని కోరాను.

ఎందుకు నాకు అలా ఉండడం రాదో వాళ్లతో చెప్పాను. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో దాదాలా ఉండేదాన్ని. సమోసాల కోసం ఫైటింగ్‌లు చేశాను. కానీ, నటిని కావాలనే కోరిక నాలో బలంగా ఉండేది. అందుకే ఎంత మంచు పడుతున్నా చీర కట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అమ్మాయిలాగా హావభావాలు పలికించడం, వయ్యారంగా నడవడం ఇవ్వన్నీ నేర్చుకునే సరికి చాలా అలసటగా అనిపించేది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే నాకు బలమైన కోరిక ఉండేది. ఎంత కష్టంగా ఉన్నా దర్శకనిర్మాతలు చెప్పేవి శ్రద్ధగా వినేదాన్ని’’ అంటూ ఆ రోజులను సరదాగా గుర్తుచేసుకుంది తమన్నా.