రీసెంట్ సమయం లో ప్రేక్షకులను పొట్ట చెక్కలు అయ్యే రేంజ్ లో నవ్వించిన సినిమా , శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘సామజవరగమనా’ అనే చిత్రం. ప్రసుతం థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ కి అతి చేరువలో ఉంది. మొదటి రెండు రోజులు వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కాస్త తడబడినా, మూడవ రోజు మాత్రం వసూళ్ల పరంగా మంచి గ్రోత్ ని అందుకుంది.
మూడు కోట్ల 20 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా రేపటితో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు తీస్తూ వచ్చిన శ్రీ విష్ణు కెరీర్ కి ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా నుండి అయినా ఆయన కెరీర్ పరంగా ఆచి తూచి అడుగులు వేస్తాడో లేదో చూద్దాం.
ఇకపోతే ఈ సినిమా లో ముందుగా హీరో గా అనుకున్నది శ్రీవిష్ణు ని కాదట, అల్లరి నరేష్ ని అట.డైరెక్టర్ రామ్ అబ్బరాజు అల్లరి నరేష్ ఉగ్రం సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో వెళ్లి, సెట్స్ లోనే ఆయనకీ స్టోరీ లైన్ వినిపించాడట. చాలా బాగుంది, పూర్తి స్క్రిప్ట్ న్యారేషన్ ఈ ఆదివారం ఇంటికి వచ్చి ఇవ్వు అని అన్నాడట. కథ మొత్తం విన్న తర్వాత అల్లరి నరేష్ ఎంతగానో నచ్చింది. డేట్స్ ఎప్పటి నుండి కావాలి అని అడగగా, వచ్చే వారం నుండే కావలి అన్నాడట.
వచ్చే వారం అయితే అసలు కుదరదు, ఎందుకంటే ఉగ్రం సినిమా షెడ్యూల్స్ రాత్రులు చాలా రోజులు ఉన్నాయి, అలాగే సమాంతరం గా పగలు షూట్స్ కూడా ఉన్నాయి. షెడ్యూల్స్ మొత్తం డిజైన్ చేసేసారు కూడా అని అన్నాడట అల్లరి నరేష్. ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాక మాత్రమే నేను ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వగలను, అప్పటి వరకు వేచి ఉండేపని అయితే ఉండు, లేదంటే వేరే హీరో తో చేసుకో అన్నాడట. దీనితో రామ్ అబ్బరాజు శ్రీ విష్ణు తో ఈ సినిమాని తీసాడు, ఆ తర్వాత ఫలితం మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాని అల్లరి నరేష్ తీసి ఉండుంటే అతనికి మంచి కం బ్యాక్ సినిమా అయ్యేది, పాపం బ్యాడ్ లక్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.