ఒకప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత హీరోయిన్ పాత్రలు కాకుండా సినిమాల్లో కొన్ని కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈమె. ఇక ఇటీవల నటిక బిజీ అయిన ప్రియమణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం వర్ష సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఆమె. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల నాగచైతన్య కాస్ట్లీ సినిమాలో సీఎంగా కనిపించింది ప్రియమణి. దాని తర్వాత జవాన్ సినిమాలో సైతం కనిపించబోతోంది.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ముద్దు సన్నివేశాల్లో నటించడం లేదని తెలిపింది. దానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. ‘‘వివాహం అయ్యాక తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించకూడదనుకున్నా. సినిమాలో నాది ఒక పాత్ర అయినా వ్యక్తిగతంగా నేను దాని వల్ల ఇబ్బంది పడతాను. ఎందుకంటే అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నేను నా భర్తకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 2017లో నాకు వివాహమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సీన్స్‌లో నటించలేదు.
సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు చెబుతాను. నేను ఏ సినిమాలో నటించినా దాన్ని మా ఇరు కుటుంబాల వాళ్లు చూస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల వాళ్లు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని తెలిపింది. ఇక తన పెళ్లి సమయంలో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శించినట్లు ప్రియమణి ఇటీవల తెలిపింది. బాడీ షేమింగ్, శరీర రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది.