పెద్ద సినిమాలకంటే కూడా మన టాలీవుడ్ లో చిన్న సినిమాలకే ఎక్కువగా కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. గడిచిన దశాబ్ద కాలం లో క్లాసిక్ స్టేటస్ ని సాధించిన సినిమాలలో అత్యధికంగా చిన్నవే అవ్వడం విశేషం. అలాంటి సినిమాలలో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి యూత్ లో మామూలు క్రేజ్ ఉండేది కాదు.
బోర్ కొట్టినప్పుడల్లా ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అంత మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నిన్న బక్రీద్ సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ తో కళ్ళు చెదిరే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ సినిమాకి మొదటి రోజు ఓవరాల్ గా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం నైజాం ప్రాంతం నుండే 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు.ఇది గత ఏడాది రీ రిలీజ్ అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి కంటే ఎక్కువ. కేవలం నైజాం లోనే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా కోటి 40 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు.
ఈ సినిమా రీ రిలీజ్ అయినా రోజు రెండు కొత్త సినిమాలు విడుదల అయ్యినప్పటికీ , ఈ చిత్రానికే ప్రేక్షకులు ఎక్కువ మొగ్గు చూపించారు. ఇది ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టేలా చేసిన సంఘటన. ఈమధ్య కాలం లో స్టార్ హీరోల రీ రిలీజ్ కి కూడా ఈ రేంజ్ ఓపెనింగ్ దక్కలేదని అంటున్నారు. నిన్న బక్రీద్ పండుగ అవ్వడం తో ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.