మన తెలుగు సినీ పరిశ్రమ ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన ఆంధ్ర ప్రదేశ్ లో స్టార్ హీరోల సినిమాల వసూళ్లు ఘననీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలను అయితే ఇష్టమొచ్చినట్టు తొక్కిపారేసారు. అలా ఎన్నో జరిగాయి. చివరికి మెగాస్టార్ చిరంజీవి పూనుకొని, స్టార్ హీరోలైన మహేష్ బాబు మరియు ప్రభాస్ తో కలిసి స్వయంగా టికెట్ రేట్స్ గురించి చర్చలు జరిపి, పార్థ జీవో ని రద్దు చేసి, కొత్త జీవో ని మాస్ అయ్యేలా చేసారు.
ఈ జీవో రప్పించడం కోసం మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి ముఖ్యమంత్రి జగన్ కి దండం పెడుతూ బ్రతిమిలాడడం,కోట్లాది మంది అభిమానులు మరియు ప్రజలకు చాలా ఇబ్బందికి గురి చేసింది. ఎందుకంటే చిరంజీవి అనే వాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత అంతటి ప్రజాధారణ పొందిన వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ స్థాయిలో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో 24 శాతం ఓటింగ్ ని దక్కించుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి దండం పెట్టి బ్రతిమిలాడుతుంటే జగన్ కి చీమకుట్టినట్టు కూడా లేకుండా నవ్వడం అనేది అభిమానులకు ఎంతో శోకాన్ని మిగిలించింది.
ఇదంతా పక్కన పెడితే సీనియర్ నటుడు, మాజీ రాజ్య సభ సభ్యుడు మురళి మోహన్ రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘టికెట్ రేట్స్ కోసం చిరంజీవి, మహేష్ బాబు మరియు ప్రభాస్ ముఖ్యమంత్రిని కలవడానికి ఆయన ఆఫీస్ కి వెళ్లారు. అప్పుడు తమ కార్లను పార్కింగ్ ఏరియా లోకి తీసుకెళ్తుండగా, ప్రభుత్వ సిబ్బంది గేట్ దగ్గరే ఆపేసి, నడుచుకుంటూ వెళ్లమని చెప్పారు.’ అంటూ చెప్పుకొచ్చాడు మురళి మోహన్.
కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవం లాగా భావించే మన స్టార్ హీరోలకు ఇలాంటి అవమానం జరిగిందా అని అభిమానులు ఆవేశం తో ఊగిపోతున్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుండి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి రావాలంటే, ముందుగా పాత్రల ధ్రువీకరణ చేయించుకోవాలి, ఆ తర్వాత ప్రభుత్వం దయ చూపిస్తే టికెట్ రేట్స్ పెంచుకుంటారు. అది కూడా ప్రభుత్వానికి ఇష్టమైన హీరోలకే టికెట్ రేట్స్ అనుమతిని ఇస్తారు. పవన్ కళ్యాణ్ సినిమా అయితే దయా జాలి లేకుండా తొక్కేస్తారు అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.