దాని కోసం 5 నిమిషాలు కేటాయించాల్సి రావడం దారుణం..: అసిన్

- Advertisement -

సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగా ఉంటున్నాయి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ పెళ్లి విడాకులు వెంటవెంటనే జరిగిపోవడం షరా మామూలైపోయింది. ఈ మధ్య స్థార్ కపుల్స్ విడాకులకు ముందు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫొటోలు డిలీట్‌ చేయడం ద్వారా ముందస్తు ఇన్ఫర్మేషన్‌ ఇస్తున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ అసిన్‌ కూడా తన భర్త రాహుల్ శర్మకు త్వరలో విడాకులు ఇవ్వబోతున్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. అసిన్‌ తన ఇస్టా ఖాతా నుంచి భర్తతో ఉన్న ఫొటోలు డిలిట్‌ చేయడమే అందుకు కారణం. పెళ్లి ఫొటోలను కూడా తొలగించింది. దీంతో అసిన్‌ తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే అనుమానం అభిమానులకు కలిగింది. ఈ వార్త ఆనోటా ఈనోటా పడి వైరల్‌గా మారింది. దీనిపై నటి అసిన్ ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చింది.

అసిన్
అసిన్

సాధారణంగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండని అసిన్.. తన విడాకుల వార్తల గురించి మాత్రం ఇన్‌స్టా స్టోరీలో స్పందించడం విశేషం. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని, తమ పెళ్లికి ముందు కూడా తాము బ్రేకప్ చెప్పేసుకున్నట్లు వచ్చిన వార్తలను అసిన్ గుర్తు చేసింది. అసిన్, రాహుల్ శర్మ 2016లో పెళ్లితో ఒక్కటవగా.. వాళ్లకు ఓ కూతురు ఉంది. ఆమె వయసు ఇప్పుడు ఐదేళ్లు. తాము సమ్మర్ హాలీడేస్ లో ఉన్న సమయంలో ఇలాంటి పుకార్లు రావడంపై అసిన్ తీవ్రంగా స్పందించింది. “సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉన్నాం. ఇద్దరం ఒకరి పక్కన మరొకరం కూర్చున్నాం. మా బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఊహాజనిత, నిరాధార వార్తలు వచ్చాయి. గతంలో మా ఇరు కుటుంబాలు మా పెళ్లి పనుల్లో ఉన్న సమయంలో మేము బ్రేకప్ చెప్పేసుకున్నట్లు వచ్చిన వార్తలు నాకు గుర్తొచ్చాయి. మంచి హాలిడే ఎంజాయ్ చేస్తున్న సమయంలో దీని కోసం ఐదు నిమిషాల వెచ్చించాల్సి రావడం నిరాశ కలిగించింది” అని అసిన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసింది.

‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’తో తెలుగు తెరకు పరిచయమైన ఆసిన్‌.. ‘శివమణి’, ‘గజినీ’, ‘ఘర్షణ’, ‘పోకిరి’ (తమిళ వెర్షన్‌), ‘మజా’, ‘దశావతారం’ వంటి దక్షిణాది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘హౌస్‌ఫుల్‌ 2’, ‘లండన్‌ డ్రీమ్స్‌’.. ఇలా పలు హిందీ సినిమాల్లోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. బాలీవుడ్‌లో నటిస్తోన్న తరుణంలోనే మైక్రోమ్యాక్స్‌ ఫౌండర్‌ రాహుల్‌ శర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఈ జంట 2016లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఆసిన్‌ సినిమాలకు దూరమయ్యారు. ఇదిలా ఉండగా, తన భర్తతో దిగిన ఫొటోలను ఆసిన్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. దీంతో ఆమె విడాకులు తీసుకోనుందంటూ ప్రచారం తెరపైకి వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here