ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో కథానాయకుడయ్యాడు. అంతకు మునుపు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. జోష్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. కానీ, సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే 2016లో విడుదలైన గుంటూర్ టాకీస్
తో సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్ అయిపోయాడు.
ఈ మూవీలో హీరోగానే కాకుండా డైలాగ్ రైటర్ గాను పేరు సంపాదించుకున్నాడు. గతేడాది డిజె టిల్లు
మూవీతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో సిద్ధుకు టాలీవుడ్ లో భారీ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం సిద్దు టిల్లు స్కేర్
తో పాటు దట్ ఈజ్ మహాలక్ష్మి
, తల్లుమాల
రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో చాలా ఏళ్ల నుంచి స్టైలిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, లిరిసిస్ట్ గా సేవలు అందిస్తోన్న నీరజా కోన దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. నీరజ కోనకు ఇదే తన తొలి సినిమా.
ఈ సినిమాకు ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సిద్ధు.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇండస్ట్రీలో ఆరంగేట్రం చేసే ముందు తనకు ఎదురైన ఓ ఘోర అవమానాన్ని కూడా బయటపెట్టాడు. తన ముఖం మీద మొటిమలు వాటి తాలుకా మచ్చలు, గుంతలు ఉంటాయి.
అయితే సినిమాల్లో ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకతను ముఖం మొత్తం గుంతలే.. నువ్వు హీరో అవుతావా..?
అంటూ సిద్దు ముఖం మీదే చెప్పేశారట.. ఆ మాట తట్టుకోలేక చాలా ఏడ్చేశాడట. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని తనకు తానే ధైర్యం చెప్పుకుని కసిగా ప్రయత్నించినట్లు చెప్పాడు.. దీంతో సిద్దును అంతగా అవమానించిన వ్యక్తి ఎవరా అంటూ జనాలు ఆరా తీస్తున్నారు.