పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ సినిమాని వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ ముంచుకొస్తున్న కూడా ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చెయ్యకపోవడం తో అభిమానులు మేకర్స్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీ రోజు ట్విట్టర్ లో వాళ్ళను ట్యాగ్ చేసి తెగ తిడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ కూడా సినిమా విడుదలకు నెల రోజుల ముందు వరకు కూడా టీజర్ లేకుండా ఉండడం జరగలేదని, మొట్టమొదటి సారి జరిగిందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే అభిమానుల ఇన్ని రోజుల ఎదురు చూపులకు మొత్తానికి తెర పడింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వారాహి విజయ యాత్ర’ లో బిజీ గా ఉన్నప్పటికీ కూడా , డైరెక్టర్ సముద్ర ఖని, ప్రస్తుతం ఆయన ఉంటున్న భీమవరం కి వెళ్లిమరీ టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ ని చెప్పించుకున్నాడు.
డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫైనల్ ఔట్పుట్ ని చూసి పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. అంటే టీజర్ లో అంత ఎంటర్టైన్మెంట్ ఉందా?, పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సీరియస్ సినిమాలే చేస్తూ వచ్చాడు. ఆయనకి ఎంతో మంచి స్ట్రాంగ్ జోన్ అయినా ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసాడు. దీనితో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.
‘ @PawanKalyan had a crazy reaction while watching the #BroTheAvatar teaser
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 28, 2023
pic.twitter.com/JFKfiYrFn2
ఇక అలా నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ‘బ్రో’ టీజర్ వచ్చిన తర్వాత వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసిన అనుభూతి కలుగుతుందని, సినిమా అంత చక్కగా వచ్చిందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే ట్రేడ్ లో బ్రో చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు, ఈ టీజర్ విడుదల తర్వాత ఆ అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, చూడాలి మరి.