ప్రముఖ ఐటమ్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హంస నందిని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇటీవలే క్యాన్సర్ తో పోరాడి గెలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయింది. టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా సరే తన గ్లామర్ తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్న ఈమె పూణేకు చెందింది. టాలీవుడ్ లో ఈమెకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇక పెద్ద హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోకపోయినా సరే ఈమంటే పడి చచ్చే వారి సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ షో తో యువతను ఆకట్టుకునే ఈమె అంటే ఎవరైనా సరే ఫిదా అవుతారు.
టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఒకనాడు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు హంసానందిని. ఈమె చాలా సినిమాలలో కొన్ని స్పెషల్ సాంగ్స్ కు ఆడి పాడారు. పూనేకు చెందిన ఈమె 2004లో విడుదలైన ఒకటవుదాం చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఆమెకు వరుసగా సినిమాలు వచ్చాయి. ప్రవరాఖ్యుడు, అధినేత, ఆహనా పెళ్ళంట, ఈగ సినిమాలలో నటించారు. మిర్చి సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేశారు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మిర్చి చిత్రం సూపర్ హిట్ అవడంతో అందులో ఈ పాటను హంస చేసినందుకు బాగా పేరు వచ్చింది. అత్తారింటికి దారేది,భాయ్, రామయ్య వస్తావయ్య, లెజెండ్ తో పాటుగా మరికొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ను చేసింది. జై లవకుశ చిత్రంలో బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపించింది. ఈవిడ ఆఖరిసారి కనిపించిన సినిమా పంతం, అందులో గోపీచంద్ కథానాయకుడుగా నటించారు.
కొంతకాలం క్రితం హంసానందిని ఒక సుదీర్ఘమైన క్యాన్సర్ బారిన పడి, చికిత్స తీసుకొని, ఈ మధ్యకాలంలోనే కోలుకున్నారు. ఈ క్యాన్సర్ వచ్చిన కారణంగా చాలాసార్లు కీమోథెరపీ తీసుకొని ,ఇప్పుడు గుర్తుపట్ట లేకుండా మారిపోయారు. ఆ సమయంలో ఆవిడ సామాజిక మాధ్యమం వేదికగా తన మానసిక వేదనను, స్థితిని అందరికీ తెలియజేశారు. క్యాన్సర్ తో పోరాడి ఎలా అయినా గెలవచ్చని ఇతర క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్ని ఇచ్చారు. హంసా నందిని ఫోటోలను ఈ మధ్యకాలంలో చూసిన వారందరూ షాక్ కి గురవుతున్నారు. ఆవిడ ఒక సన్యాసినీగా మారిపోయింది. ఫ్యాషన్ దుస్తులతో కనిపించే ఈమె కాస్త ఇప్పుడు నిండు అయిన దుస్తులతో ప్రశాంతంగా కనిపిస్తోంది. ఒక ఆశ్రమంలో ఆమె కనిపించారట. ఇలా సన్యాసినిగా మారిన క్రమంలో సినిమాలను మానేసారని ఇప్పుడు ప్రచారం అవుతోంది.