బౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా కొంతమంది కమెడియన్స్ వాళ్ళు చేసిన అద్భుతమైన పాత్రల కారణంగా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంటారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు గుండు హనుమంతరావు. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘అహ నా పెళ్ళంటా’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా గుండు హనుమంత రావు, ఆ తర్వాత ఏకంగా 600 సినిమాలకు పైగా చేసి , కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ముఖ్యంగా అప్పట్లో జెమినీ టీవీ లో ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘అమృతం’ అనే సీరియల్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సీరియల్ ని వీక్షకులు ప్రతీ రోజు చూస్తూనే ఉంటారు. ఈ సీరియల్ లో ఆంజనేయులు అనే పాత్ర ద్వారా ‘గుండు హనుమంతరావు ‘ పండించిన హాస్యం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అయితే దురదృష్టం కొద్దీ ఆయన 2018 వ సంవత్సరం లో చనిపోయిన ఘటన యావత్తు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మరియు అభిమానులను శోక సంద్రం లోకి నెట్టేసింది.
ఇది ఇలా ఉండగా గుండు హనుమంత రావు కి ‘ఆదిత్య’ అనే కుమారుడు ఉన్నాడు. ఇతను ఈ కాలం లో పుట్టాల్సిన బిడ్డ కాదు. ఎందుకంటే తల్లి తండ్రులను పట్టించుకోని సంతానం ఉన్న ఈ రోజుల్లో, గుండు హనుమంత రావు అనారోగ్యానికి గురి అయ్యినప్పుడు చిన్నవయసులోనే ఆయనకీ ఎన్నో సేవలు చేసాడు. ఆయనకీ సంబంధించిన అన్నీ పనులను దగ్గరుండి మరీ చూసుకునేవాడు ఆదిత్య. ఆదిత్య కేవలం తండ్రి మాత్రమే కాదు, తల్లి మరియు సోదరి కూడా చనిపోయి, ఇప్పుడు ఎవ్వరూ లేని అనాధగా మిగిలిపోయాడు.
అయితే ఆదిత్య ని ప్రముఖ స్టార్ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం దత్తత తీసుకున్నాడు. గుండు హనుమంతరావు నాకు సొంత తమ్ముడితో సమానం అని, వాడి కొడుకు నాకొడుకే అని, కాబట్టి వాడి బాధ్యతలు మొత్తం నావే, జీవితం లో స్థిరపడి, పెళ్లి చేసుకునేంత వరకు ఆదిత్య బాధ్యతలు మొత్తం నేనే చూసుకుంటానని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం.
అయితే ఆదిత్య కి సంబంధించిన కొన్ని ఫోటోలోను చూసి నెటిజెన్స్ షాక్ కి గురి అయ్యారు. ఎందుకంటే ఈ కుర్రాడు స్కిన్ టోన్ మొత్తం తెల్లగా, ముఖం కూడా ఎంతో అందంగా ఉంది. ఇతను సినిమాల్లోకి వచ్చి హీరో గా స్థిరపడిపోవచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలను క్రింద అందిస్తున్నాము చూడండి.