వేణు స్వామితో డింపుల్ హయాతి రహస్య పూజలు.. ఫొటోస్ వైరల్..

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. దాంతో జనాల్లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది.. అందులో ఆయన చెప్పినవి నిజమవుతుండటంతో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు.. ఇక హీరోయిన్లు ఆయనతో ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారు.. దాంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని అంటున్నారు..తాజాగా మరో హీరోయిన్ ఆయన చేత ప్రత్యేకంగా పూజలు చేయించింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

వేణు స్వామి
వేణు స్వామి

మొన్నీమధ్య రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు.. అదే విధంగా గతంలో ఓ హీరో చనిపోతాడు అని చెప్పాడు.. హీరో తారకరత్న చనిపోయాడు.. ఇక సినిమాల విషయంలో కూడా ఈయన చెప్పినట్లే జరుగుతుండటం తో ప్రతి ఒక్కరు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.. అలాగే చాలా మంది హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకుంటే కేరీర్ దూసుకుపోతుందని నమ్ముతున్నారు.. ఈ క్రమంలోనే హీరోయిన్ రష్మిక మందన్నా వేణు స్వామితో పూజులు చేయించుకుని తన శిష్యురాలిగా మారిపోయింది.

మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామిని సంప్రదించి తనకు సంబంధించి కొన్ని పూజలు చేయించుకుంది. తాజాగా ఇప్పుడు డింపుల్ హయాతి కూడా ఆ లిస్ట్ లోకి చేరింది. ఈ హైదరాబాద్ బ్యూటీ వేణు స్వామితో రహస్య పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..డింపుల్ హయాతి కెరీర్ అంతగా బాగోలేదు. ఆమెకు ఆఫర్స్ వస్తున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు.రవితేజకు జంటగా ఖిలాడి చిత్రం చేయగా నిరాశపరిచింది. లేటెస్ట్ రిలీజ్ రామబాణం మరో డిజాస్టర్ అయ్యింది.కనీసం ఈ పూజలు అన్నా ఫలిస్తాయేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here