లక్ష్మీ ప్రణతి కి ముందు ఎన్టీఆర్ లో ఆ అమ్మాయితో పెళ్లి సెట్ అయ్యిందా..! మరి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణీత పేర్లు ముందు వరుసలో ఉంటుంది. 2011 వ సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనకోడలు, మరియు నార్నె శ్రీనివాస రావు కుమార్తె అయిన లక్ష్మి ప్రణతి ని పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ తో ఆమె పెళ్లి జరుగుతున్న సమయం లో ఆమెకి కేవలం 18 ఏళ్ళు మాత్రమే, అప్పట్లో ఎన్టీఆర్ మైనర్ బాలికని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ మీడియా లో రచ్చ కూడా జరిగింది.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

కానీ అతిరధ మహారథుల సమక్షం లో వీళ్లిద్దరి పెళ్లి చిరకాలం గుర్తుండిపోయ్యే రేంజ్ లో జరిగింది. ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి ఎంతో అన్యోయంగా బ్రతుకుతూ తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దంపతులిద్దరికీ అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.

ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రణతి ని పెళ్లి చేసుకునే ముందే ఆయనకీ మరో అమ్మాయితో పెళ్లి చూపులు జరిగాయి. ఎన్టీఆర్ కి కూడా ఆ అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయి తెలుగుదేశం పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడి కుమార్తె, అంతా మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత ఆ పెళ్లి కూతురు తండ్రి కేసు లో చిక్కుకొని అరెస్ట్ అయ్యాడు, చంద్ర బాబు నాయుడు కూడా అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేసేసాడు.

- Advertisement -
JR NTR

ఇక అలాంటి బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ ఉన్నోళ్ళతో సంబంధం వద్దని ఎన్టీఆర్ తల్లి ఒప్పుకోకపోవడం తో ఈ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు లక్ష్మి ప్రణతి ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ దాంపత్య జీవితాన్ని మన కళ్లారా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికీ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తుంది. వీళ్లిద్దరి పెళ్లి జరిగి గత నెల మే 5 వ తారీఖుతో 12 ఏళ్ళు పూర్తి చేసుకొని దాంపత్య జీవితం అంటే ఇలా ఉండాలి అనేంత ఆదర్శ దంపుతులు అయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here