మిల్కీ బ్యూటీ తమన్నా కొద్దిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మ నటించిన ‘జీకర్దా’ అనే హిందీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఇప్పటివరకు చూడని తమన్నాను ఈ వెబ్ సిరీస్ లో ఆడియన్స్ చూడడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నా తన ఇమేజ్ ని సైతం పక్కన పెట్టి బోల్డ్ సీన్స్ లో నటించడమే కాకుండా బూతు డైలాగులు కూడా చెప్పింది.
తమన్నా బోల్డ్ సీన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో తమన్నాని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన తమన్నా ఇప్పటివరకు హద్దులు దాటలేదు. అలాంటిది హిందీ వెబ్ సిరీస్ కోసం తమన్నా తన హద్దులు అన్ని చెరిపేసి ఇలా నటించడం ఏంటంటూ చాలామంది ఆమెను విమర్శించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో తమన్నాని సన్నీలియోన్ తో పోల్చారు.
అయితే తాజాగా వీటన్నింటిపై తమన్నా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ లో తమన్నా బోల్డ్ సీన్స్ చేయడం గురించి మాట్లాడుతూ.. “కథకు ఇలాంటి సన్నివేశాలు చాలా అవసరం. ఒక రిలేషన్షిప్ ని నిజంగా చూపించడంలో ఇలాంటి సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. అది జనాలకు నచ్చినా? నచ్చకపోయినా కథలో భాగంగా వాటిని అలాగే చూపిస్తారు. ఓ ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలోనే ఆ సన్నివేశాలు వస్తాయి. ఇక మా డైరెక్టర్ అరుణిమ ఇచ్చిన సూచనలు అలాంటి సన్నివేశాల్లో సులభంగా, సౌకర్యవంతంగా నటించేందుకు ఉపయోగపడ్డాయి. ఎవరు విమర్శించినా జనాలకు నచ్చడం వల్లే అలాంటి సన్నివేశాల్లో నటించానని చెప్పింది.” అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.