సినిమా ప్రపంచం లో కూడా చాలా బాధలు ఉంటాయి చూడడానికి సినిమా వాళ్ళకి కష్టాలు ఏం వుండవు కదా అని అనుకుంటారు ప్రేక్షకులు. కానీ వాళ్ళకి కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి పైగా మంచి పేరు తెచ్చుకుని పైకి వచ్చిన వాళ్లు కూడా రాజకీయాలకి బలైపోతూ ఉంటారు. మొదట హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలని అందుకుని తర్వాత సహాయ పాత్రలు చేసి రాజకీయాలకి బలై అవకాశాలని కోల్పోయారు నటి పద్మ.

కుటుంబ సభ్యులు మరణం తరవాత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. కుక్క అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు పద్మ ఆ సినిమాతోనే కుక్క పద్మ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వరుసగా ఎనిమిది సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించారు. మొండిఘటం అనే సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించారు.

వరుస సినిమా అవకాశాలతో ఈమె బిజీగా ఉంటున్నప్పుడు ఒక రచయిత ఈమె ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని అడిగారు. కానీ ఈమె ఒప్పుకోలేదు, తిరస్కరించారు దాంతో అప్పటి నుండి అవకాశాలు రాక ఆమె ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
పద్మ 1986 వరకు సినిమాల్లో కనపడ్డారు. ఆ తర్వాత సినిమాలు ఈమె చేయలేదు. 1986 నుండి సినిమాల లో కానీ సీరియల్స్ లో కానీ ఆ వ్యక్తి రానివ్వలేదు అన్నారు. పైగా ఆ రచయత ఈమె కి పిచ్చి అని కూడా ప్రచారం చేసారని అన్నారు. అవకాశాలు ఇవ్వడం లేదని పిచ్చి అని ముద్ర వేశారని డబ్బింగ్స్ వంటివి ఏమి రావని తిండికి కూడా ఇబ్బందిగా ఉందని పద్మ అన్నారు.