యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రామాయణం ని మోడరన్ ఫామ్ లో నేటి ఆడియన్స్ కి నచ్చే విధంగా డైరెక్టర్ ఓం రౌత్ తీసిన విధానం ఎవ్వరికీ నచ్చలేదు. ప్రథమార్థం మంచి ఎమోషనల్ కనెక్ట్ తో ఉన్నప్పటికీ, ద్వితీయార్థం మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం , గ్రాఫిక్స్ చాలా వింతగా అనిపించడం , రావణాసురిడి రోల్ ఇవన్నీ సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి.
ముఖ్యంగా చివరి 30 నిముషాలు ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా చెప్తున్నారు ఆడియన్స్. అయితే సినిమా ఎలా ఉన్నప్పటికీ ఇందులో హీరో గా చేసిన ప్రభాస్ మాత్రం చాలా కష్టపడ్డాడు అనే చెప్పొచ్చు. చాలా సన్నివేశాల్లో ఆయన లుక్స్ బాగాలేకపోయినప్ప్పటికీ తన నటనతో సన్నివేశాలను రక్తి కట్టించాడు.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. అదేమిటంటే ఈ చిత్రానికి ప్రభాస్ కేటాయించిన డేట్స్ చాలా తక్కువ, ఆయన షూటింగ్ లో పాల్గొన్నది కూడా తక్కువేనట. చాలా సన్నివేశాలకు ప్రభాస్ ఫోటోలను 360 డిగ్రీలలో అన్ని యాంగిల్స్ తీసుకొని, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తెరకెక్కించారట. ప్రభాస్ ఒరిజినల్ గా 50 శాతం కూడా షూటింగ్ లో పాల్గొని ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ డెవలప్ చేసే ఇమేజిలు మన అసలు ముఖానికి 90 శాతం పోలినట్టు ఉంటుంది. ఎవరైనా బాగా గమనిస్తే తప్ప కనిపెట్టలేరు. ఈ చిత్రం కోసం అదే ఉపయోగించారని తెలుస్తుంది. ఇప్పుడు రాబొయ్యే చాలా సినిమాల వరకు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాబొయ్యే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అన్నీ రంగాలలో ఒక విప్లవం ని తీసుకొస్తుందని, అందులో సినీ రంగం అగ్రహామి గా నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు.