ఆ నిర్మాత తనని వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసిన నటి.. ఏకంగా షో లోనే అలా చేయటంతో..!

- Advertisement -

హిందీలో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన షో తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా. ఈ పాపులర్ షో అక్కడి బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతా బాగానే ఉన్నా ఈ షో నిర్మాతలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం వారిపై వస్తున్న ఆరోపణలే. ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు. ఇప్పటికే మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా ఈ షో నుంచి తప్పుకోగా తాజాగా మరో నటి కూడా తప్పుకుంది.
తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా షోలో నటిస్తున్న దిశా వకాని తాను ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే దిశా వకానీ ఉల్టా చష్మా నుంచి నిష్క్రమించడంపై మోనికా సంచలన ఆరోపణలు చేసింది. తనలాగే దిశా వకానికి కూడా వేధింపులు ఎదురై ఉండవచ్చని మోనికా కామెంట్స్ చేసింది.

మోనికా భదోరియా
మోనికా భదోరియా

దిశా వకానీ షోకు తిరిగిరాలేదని ఆమెకు డబ్బులు కూడా చెల్లించకపోయి ఉండవచ్చని మోనికా తెలిపింది. అందువల్లే తాను కూడా వేధింపులు భరించలేకే షో నుంచి తప్పుకుని ఉంటుందని తెలిపింది.అయితే గతంలో ఈ షో నిర్మాతలపై మోనికా భదోరియా సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ షోలో పనిచేస్తున్నప్పుడు తనను హింసించారని ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.

తనతో వెట్టి చాకిరి చేయించుకున్నారని కానీ చివరకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో మోనికా భదోరియా బావ్రీ పాత్రతో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది.‍ అయితే ఇప్పటికే ఈ షో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా నటీనటులు షో నుంచి తప్పుకుంటూ నిర్మాతలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇంతవరకు ఆ షో నిర్మాతలు ఈ ఆరోపణలపై స్పందించలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here