ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే హిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన నటి శ్రీలీల. ఏ ముహూర్తం లో ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిందో కానీ, ఆమె ముట్టుకునే ప్రతీ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరో గా పరిచయం అవుతూ చేసిన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా కూడా, కేవలం ఈ అమ్మాయి డ్యాన్స్ వల్ల సూపర్ హిట్ అయిపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన రవితేజ ‘ధమాకా’ చిత్రం కూడా అంతే, సినిమా రొటీన్ కమర్షియల్ అని అనిపించుకున్నప్పటికీ, కమర్షియల్ గా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి , వంద కోట్ల గ్రాస్ ని కూడా కొల్లగొట్టింది. ఈ సినిమాలో శ్రీలీల వేసిన డ్యాన్స్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.

‘ధమాకా’ సినిమా అంత పెద్ద హిట్ అయ్యేలోపు శ్రీలీల కి అవకాశాల వెల్లువ కురిసింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో సినిమాలను నిర్మిస్తున్న మేకర్స్ వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’,’భగవంత్ కేసరి’,రామ్ పోతినేని – బోయపాటి సినిమా, నితిన్ సినిమా , అల్లు అర్జున్ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ ఇక్కడితో ఆగదు. సుమారుగా 8 ఫస్ట్ లుక్ పోస్టర్స్ శ్రీలీల కి సంబంధించినవి విడుదల అయ్యాయి.

వాటిల్లో అల్లు అర్జున్ పైకి శ్రీలీల ఎక్కిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా గమనిస్తే, ఆమె మొదటి సినిమా నుండి , అల్లు అర్జున్ తో ఉదయం విడుదల చేసిన పోస్టర్ వరకు, ప్రతీ హీరో మీద ఎక్కిన ఫోజులు కామన్ అయిపోయింది.

ఇలా ప్రతీ సినిమాలో శ్రీలీల తో ఎందుకు ఇలా చేయిస్తున్నారు, అలా చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఏమైనా ఉందా?, ఇలాంటి సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇప్పుడు ఆమె చేస్తున్న 8 సినిమాలలో కూడా ఇలాగే ఆమె హీరోల మీద ఎక్కిందా అంటూ సోషల్ మీడియా లో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.