టాలీవుడ్‌పై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు.. తెలుగు ప్రేక్షకులపైనా విమర్శలు..!

- Advertisement -

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్. ఇక ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయామైంది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకున్న అవికా అనంతరం వరుస సినిమాలతో మంచి అవకాశాలను అందుకుంది. అయితే ఆశించిన విజయాలను మాత్రం సొంతం చేసుకోలేకపోవటంతో ఈ అందాల భామకు అవకాశాలు తగ్గిపోయాయి.

అవికా గోర్
అవికా గోర్

తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసిన అవికా, ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్‌హాట్‌ ఫోటోలతో కుర్రకారును గిలిగంతలు పెట్టిస్తుంటుంది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అవికాపై గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం ఆమె టాలీవుడ్‌పై విమర్శలు చేయటమే.

ఇప్పటికే అనేకమంది తారలు సౌత్‌ ఇండస్ట్రీపై విమర్శలు చేశారు. ఇక్కడ అకాశాలు అందిపుచ్చుకుని పేరు తెచ్చుకున్నాక బాలీవుడ్‌ వైపు వెళ్లినవారు అక్కడ అడపాదడపా సినిమాలు చేయగానే దక్షిణాదిపై నోరుపారేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆ లిస్ట్‌లో చేరింది అవికాగోర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సౌత్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది

- Advertisement -

“సౌత్‌ సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. దక్షిణాదిన అంతా స్టార్స్ పవర్ మీదనే ఇండస్ట్రీ నడుస్తోంది. అక్కడ కేవలం స్టార్స్ సినిమాలనే ఎక్కువ చూస్తారు. కానీ బాలీవుడ్‌లో అలా ఉండదు. హిందీ పరిశ్రమలో ఎక్కువ వివక్షత ఉండదు. బాలీవుడ్ కన్నా సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎక్కువ. బాలీవుడ్‌లో తెలుగు సినిమాల రీమేక్స్‌ను ఎక్కువ ఇష్టపడతుంటారు.

కానీ, తెలుగులో హిందీ సినిమాలను అస్సలు చూడరు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అవికా గోర్ పై ఓరేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. తెలుగులో మంచి సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకొని ఇలా సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం పద్దతి కాదంటున్నారు. ఇంటర్వ్యూలో హైలైట్ అవ్వాలని, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాలని ఇలాంటివి మాట్లాడుతుంటారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here