నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లకు మోక్షజ్ఞ ని వెండితెర మీద చూసే అదృష్టం అందని ద్రాక్షా లెక్క మారింది. అయితే రీసెంట్ గా మోక్షజ్ఞ బెస్ట్ ఫ్రెండ్ బెల్లంకొండ గణేష్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

మోక్షజ్ఞ ప్రస్తుతం విదేశాల్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నాడని, ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీ లోకి అడుగుపెడుదాం అనుకున్నాం కానీ, నేను ముందుగా వచేసానని, మోక్షజ్ఞ వచ్చే ఏడాది కచ్చితంగా తన మొదటి సినిమాని ప్రారంభిస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే మోక్షజ్ఞ రూపు రేకలు చూసి, ఈయన హీరో ఎలా అవుతాడు రా బాబు అని అనుకునేవాళ్లు అప్పట్లో ఫ్యాన్స్. ఎందుకంటే బాగా లావుగా ఉంటూ బానపొట్ట వేసుకొని, బట్ట తల కూడా వచ్చేసిందా అనిపించేలా కనిపించాడు అప్పట్లో మోక్షజ్ఞ తేజ.

అయితే మోక్షజ్ఞ తేజ రీసెంట్ ఫోటోలు అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా షాక్ కి గురి చేసింది. బాగా తగ్గిపోయి , చాలా స్మార్ట్ గా కనిపిస్తున్న మోక్షజ్ఞ ని చూసి,ఇతను ఆరు నెలల క్రితం కూడా బాగా లావుగా ఉండేవాడు, సడన్ గా ఇంత ఎలా తగ్గిపోయాడు అని అనుకున్నారు. అసలు ఇంత తక్కువ సమయం లో అంత ఎలా తగ్గగలరు అని అనుకున్నారు. అసలు ఎలా తగ్గాడు అని ఆరాలు తియ్యగా రీసెంట్ గానే మోక్షజ్ఞ ‘లైపోసక్షన్’ చేయించుకున్నాడని తెలిసింది.

గతం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే తన శరీరాన్ని బాగా పెంచేసాడు. ఎంత వ్యాయామం చేసిన ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదు అనిపించడం తో రాజమౌళి సలహా తో ‘లైపోసక్షన్’ ట్రీట్మెంట్ చేయించుకొని ‘యమదొంగ’ సినిమాలో చిక్కిన చీపురు పుల్లలాగా మారిపోయాడు. అప్పటి నుండి అదే ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. మోక్షజ్ఞ తేజ ఇన్ని రోజులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం కూడా తన శరీర ఆకారమే అని, ఎన్ని ప్రయత్నాలు చేసిన తగ్గకపోవడం తో ఇలా ‘లైపోసక్షన్’ చేయించుకున్నాడని తెలుస్తుంది.
