యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమాపై వివాదాలు కూడా రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. మన పురాణాలలో ఎక్కడ కూడా రాముడు మీసం తో కనిపించలేదు. కానీ ఆదిపురుష్ చిత్రం లో మాత్రం ప్రభాస్ మీసం తో కనిపించడం ఇప్పుడు ఇండియా వైడ్ చర్చనీయాంశంగా మారింది.
దీనిపై మన టాలీవుడ్ కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ గతం లో శ్రీరాముడి మీద తీసిన సినిమాల్లో రాముడికి మీసం ఉన్నట్టుగా ఎక్కడా చూపించలేదు. అంతే కాదు ఈ సినిమా లో రావణాసురిడి వేషధారణ కూడా చాలా చిత్రవిచిత్రం గా డిజైన్ చేసాడు డైరెక్టర్ ఓం రౌత్. ఒక్క సీత మరియు హనుమంతుడు పాత్రలు మాత్రం ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియా లో ట్రోల్ తెగ వైరల్ గా మారింది.
మన చిన్నతనం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘చంద్రముఖి’ సినిమాని ఎన్నో సార్లు చూసి ఉంటాము.ఈ సినిమా సెకండ్ హాఫ్ లో జ్యోతిక కి పట్టిన చంద్రముఖి దెయ్యాన్ని బయటకు రప్పించడానికి ‘రామ చంద్ర సిద్ధాంతి’ వస్తాడు. ఈ పాత్ర పోషించిన నటుడి పేరు అవినాష్. తమిళం లో ఈయన పెద్ద క్యారక్టర్ ఆర్టిస్టు, ఈ సినిమాలో ఉన్న ఆయన గెటప్ కి మరియు ప్రభాస్ ఆదిపురుష్ గెటప్ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ట్రోల్ల్స్ చేస్తున్నారు.
బాగా పరిశీలిస్తే అది నిజమే అనిపించింది. వీళ్లిద్దరి లుక్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. డైరెక్టర్ ఓం రౌత్ ఇలాంటివన్నీ ఎందుకు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అయితే బాగానే ఉంది, మరి సినిమా ఈ నెగటివ్ ట్రోల్ల్స్ అన్నిటినీ తట్టుకొని సక్సెస్ సాధిస్తుందో లేదో తెలియాలంటే 16 వ తారీఖు వరకు ఆగాల్సిందే.