కొద్దికాలంగా మెగా హీరోలపై కోటా శ్రీనివాసరావు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మా ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో కోట మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఏదైనా సభలో పాల్గొంటే నాగబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకు పడుతున్నారు. తాజాగా కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి. హీరోల వాణిజ్య ప్రకటనలు, వారి పారితోషికాల పై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
స్టార్ హీరోల పారితోషికాల గురించి మాట్లాడుతూ..గతంలో ఏ హీరో తన రెమ్యునరేషన్ ఇంతా, ఇంతా అని ఎక్కడా చెప్పేవాడు కాదని, ఇప్పటి హీరోలు మాత్రం నాకు రోజుకు 2 కోట్లు, 6 కోట్లు తీసుకుంటున్నానని పబ్లిక్‌గా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. అంతే కాకుండా పబ్లిక్ గా హీరోలు తమ రెమ్యునరేషన్‌లు చెప్పడం మంచి పద్దది కాదని కొంత మంది హీరోలకు చురకలంటించారు. హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న కోటా శ్రీనివాసరావు స్టార్ హీరోల రెమ్యునరేషన్‌లు, వారు నటించే కమర్షియల్ ప్రకటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా?..వాళ్లు ఏనాడూ తమ పారితోషికాల గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు నేను ఇంతా తీసుకుంటున్నా, అంత తీసుకుంటున్నా అని పబ్లిక్‌గా చెప్పేస్తున్నారు. ఇప్పడు సినిమా అంతా సర్కస్‌గా మారిపోయింది. విషాద గీతాలకు కూడా డాన్సులు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇదే సందర్బంగా హీరోల వాణిజ్య ప్రకటనలపై ఘాటుగా స్పందించారు.
ఈ రోజు రెండు పూటలా భోజనం చేస్తున్న సినీ ఆర్టిస్ట్‌లు ఎంత మంది ఉన్నారో
మా` అసోసియేషన్ గుర్తించాలి. చిన్న ఆర్టిస్ట్‌లు బ్రతకలేకపోతున్నారు. సినిమాలు లేవు కదా అని అడ్వర్టైజ్‌మెంట్ చేద్దామంటే అక్కడా వీరే ఉంటున్నారు. పోటీపడుతున్నారు. అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్ట్‌లకు పని ఎక్కడ ఉంది?. మా సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి చిన్న ఆర్టిస్ట్‌లను బ్రతికించండి అని విజ్ఞప్తి చేశారు.