మళ్ళీ పెళ్లి.. రీసెంట్ గా గత కొంత కాలం నుండి మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చిన జంట నరేష్ – పవిత్ర. ముదురు వయస్సు లో పెళ్ళికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని నరేష్ ఇలా పవిత్ర ని నాల్గవ పెళ్లి చేసుకోవడం పై సర్వత్రా విమర్శలు వినిపించాయి. అయితే సోషల్ మీడియా లో వచ్చే విమర్శలను పెడచెవిన పెట్టి, తనకి నచ్చింది నచ్చినట్టు చేయుకుంటూ పోతున్నాడు నరేష్.ఫలితంగా ఇప్పుడు ఆడియన్స్ కి ఈయన మొహం చూడాలన్నా చిరాకు కలిగే స్థాయికి తెచ్చుకున్నాడు.
కృష్ణ ఫ్యామిలీ కూడా ఇతనిని తమ కుటుంబం అని చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు నరేష్. ఇదంతా సరిపోదు అన్నట్టు , ఆయన గారి లవ్ స్టోరీ ని ‘మళ్ళీ పెళ్లి’ అంటూ ఒక సినిమా తీసి రీసెంట్ గానే జనాల మీదకి వదిలాడు. నెగటివ్ పబ్లిసిటీ కారణం గా ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వుదేమో అని ఆశపడినట్టు ఉన్నాడు నరేష్.
ఆ నెగటివ్ పబ్లిసిటీ కారణం గా మొదటి ఎదో అలా అలా కొన్ని ప్రాంతాలలో డీసెంట్ స్థాయి గ్రాస్ ని రాబట్టింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ చిత్రానికి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు నుండి వచ్చిన గ్రాస్ వసూళ్లు కనీసం థియేటర్ కి రెంట్స్ కట్టుకోవడానికి కూడా సరోపోలేదు.
అలా మొదటి రోజు వచ్చిన గ్రాస్ వసూళ్లు కూడా టాక్సులు, థియేటర్స్ రెంట్స్ మరియు GST రూపం లో మొత్తం కట్ అయ్యి ‘సున్నా’ షేర్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. నరేష్ ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాను అంటూ టీవీల ముందుకు వచ్చి తెగ ఊదరగొట్టేసాడు. ఒకవేళ అదే నిజం అయితే థియేట్రికల్ పరంగా ఆయనకి ఒక్క రూపాయిల కూడా రాలేదు. ఓటీటీ మరియు సాటిలైట్ రైట్స్ ద్వారా రికవర్ అయ్యుండొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.