త్రివిక్రమ్ నాకు అగరుబత్తితో సమానం.. బండ్లన్న వరుస ట్వీట్లతో రచ్చచేస్తున్నాడుగా

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించి ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్‌పై ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడూ హైలెట్‌గా నిలుస్తాయి. ఆయన పొగడ్తలకు అభిమానులు ఫిదా అవుతుంటారు. అందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ అంటే చెప్పలేని అభిమానం. పవన్ సినిమా ఫంక్షన్లలో తప్పకుండా ఆయన ఉండాలని కోరుకుంటారు. ఏమైందే ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో పవర్ స్టార్-బండ్ల గణేష్ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

బండ్ల గణేష్
బండ్ల గణేష్

సోషల్ మీడియా వేదికగా పవన్ అంటే బండ్ల గణేష్ అభిమానం చూపిస్తున్నప్పటికీ.. ప్రత్యక్షంగా కనిపించింది చాలా తక్కువ. వీరిద్దరి మధ్య ఈ గ్యాప్‌కు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని తెలుస్తోంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సమయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఆ ఈవెంట్‌కు రాకుండా త్రివిక్రమ్ అడ్డుపడ్డాడని, కావాలని తనను పిలవలేదని బండ్ల గణేష్ తీవ్రమైన పదజాలంతో దూషించిన ఆడియో లీక్ అయింది. అప్పట్లో అది విపరీతంగా వైరల్ అయింది. ప్రారంభంలో ఆ ఆడియో తనది కాదని బుకాయించిన బండ్ల గణేష్.. ఆ తర్వాత తనదేనంటూ ఒప్పేసుకున్నారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్‌ను పరోక్షంగా గురూజీ అంటూ సెటైర్లు, కౌంటర్లు వేస్తూనే ఉన్నారు.

త్రివిక్రమ్
త్రివిక్రమ్

బండ్ల గ‌ణేష్ త‌న ట్వీట్స్‌ను కొన‌సాగించాడు. ‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి’ అని మరోసారి గురూజీపై ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కాడు. దీంతో కొంద‌రు నెటిజ‌న్స్‌ బండ్ల గ‌ణేష్‌కి స‌పోర్ట్ చేస్తుంటే కొంద‌రు మాత్రం విమ‌ర్శిస్తున్నారు. ‘భక్తుడిని దూరం చేసే శక్తి ఎవ్వరికీ ఉండదు. కేవలం. భక్తుడి నడవడిక మాత్రమే భగవంతుడిని దూరం చేస్తుంది’ అని ఒకరంటే. ‘వీడు ఒక పెద్ద గుంట నక్క వీడిని నమ్మకండి .. స్వార్థం కోసం పవన్ కళ్యాణ్‌ని దేవుడు అంటూ వుంటాడు’ అని మరొకరు అన్నారు. మరి ఇకనైనా టార్గెట్ గురూజీ మిషన్‌ని బండ్ల గ‌ణేష్ ఆపేస్తాడో లేక కంటిన్యూ చేస్తాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here