లావణ్య త్రిపాఠి.. హీరోయిన్స్ పెళ్లికు సంబంధించి నిత్యం ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మూడు పదాలు దాటుతున్న చాలా మంది భామలు పెళ్లి పేరు ఎత్తడం లేదు. కానీ వీరి పెళ్లి పై నెటిజన్లకు , అభిమానులకు మాత్రం ఆత్రం ఆగదు. ఈ క్రమంలోనే రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అలాగే క్రేజీ బ్యూటీ లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి కూడా వార్తలు వచ్చాయి. ఈ భామ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉంది గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి.

ఈ ఇద్దరు కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఆసమయంలోనే ప్రేమలో పడ్డారని టాక్. ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన హ్యాండ్సమ్ హీరో ఎవరు అని ఒక షోలో అడగ్గా వరుణ్ తేజ్ అని టక్కున చెప్పింది ఈ చిన్నది. దాంతో ఆ ప్రేమ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వరుణ్ తేజ్ కంటే ముందు లావణ్య మరో హీరోని ప్రేమించిందట.

ఆ హీరో ఎవరో కాదు లావణ్య త్రిపాటి హీరోయిన్ గా వచ్చిన మొదటి సినిమా హీరో నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమా టైంలో నవీన్ చంద్ర కి లావణ్య త్రిపాటికి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందట.దాంతో వీళ్ళు తమిళ్ లో కూడా బ్రహ్మం అనే సినిమాలో కలిసి నటించారు. ఇక ఆ సినిమాలో నటించే టైంలో మరింత సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి లక్ష్మీదేవికి ఓ లెక్కుంది అనే సినిమాలో కూడా కలిసి చేశారు.ఇలా వరుసగా మూడు సినిమాల్లో ఇద్దరూ జంటగా నటించారు. అయితే ఈ విషయంలో ఏది నిజమో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.