ఈమధ్య కాలం లో జనాలను భారీ హంగులతో వచ్చే సినిమాలకంటే , తక్కువ బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘బలగం’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. అదే కోవలో అసలు ముఖ పరిచయం లేని నటీనటులతో చేసిన సరికొత్త ప్రయోగం ‘మేము ఫేమస్’ . చాయ్ బిస్కట్ సంస్థ నుండి నిర్మితమైన ఈ చిత్రానికి సుమంత్ ప్రభాస్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తూనే హీరో గా కూడా చేసాడు.
ఆకర్షణీయమైన ట్రైలర్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగింది. మరి మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టింది..?, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూళ్లు రావాలి?,. అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
తెలంగాణ నేటివిటీ తో తెరకెక్కిన ఈ సినిమాకి అక్కడ మంచి ఓపెనింగ్ దక్కింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలంగాణాలో మొదటి రోజు 52 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.అలాగే ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతానికి కలిపి 34 లక్షల రూపాయిల గ్రాస్, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల నుండి 86 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది.
ఇక ఓవర్సీస్ + కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 24 లక్షల రూపాయిల గ్రాస్, మొత్తం మీద కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ మరియు 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో కోటి 50 లక్షల రూపాయిల షేర్ రావాల్సి ఉంది. ప్రస్తుతం సరైన సినిమాలు కూడా ఏమి లేకపోవడం తో వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు.